రెమ్యునరేషన్ పెంచలేదంటున్న విజయ్ దేవరకొండ

Vijay devarakonda denied rumoursగీత గోవిందం చిత్రంతో ప్రభంజనం సృష్టించిన హీరో విజయ్ దేవరకొండ కాగా ఈ హీరో తనకు వచ్చిన స్టార్ డంతో అమాంతం తన రెమ్యునరేషన్ ని డబుల్ చేశాడని వార్తలు వస్తున్నాయి . ఈ వార్తలు మరింతగా స్ప్రెడ్ కావడంతో కాబోలు విజయ్ దృష్టికి వచ్చాయి దాంతో రెమ్యునరేషన్ విషయం పై స్పందించాడు . నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నానని , స్టార్ గా ఎడిగానని అనుకోవడం లేదని అందుకే నా రెమ్యునరేషన్ పెంచలేదని చెప్పాడు హీరో విజయ్ దేవరకొండ.

పెళ్లిచూపులు , అర్జున్ రెడ్డి చిత్రాలతో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ తాజాగా గీత గోవిందం చిత్రంతో ప్రభంజనం సృష్టించాడు. చిన్న చిత్రంగా విడుదలైన గీత గోవిందం ఏకంగా 120 కోట్లకు పైగా వసూల్ చేసింది. దాంతో విజయ్ దేవరకొండ తన రెమ్యునరేషన్ ని పది కోట్లకు పెంచాడని వినబడుతోంది కానీ విజయ్ మాత్రం రెమ్యునరేషన్ పెంచలేదని 5 కోట్లు మాత్రమే తీసుకుంటున్నామని పరోక్షంగా చెబుతున్నాడు . నిజమేనా ! నమ్మొచ్చా …… విజయ్ దేవరకొండ మాటలను.

English Title: Vijay devarakonda denied rumours

Thanks! You've already liked this