కన్నీళ్లు పెట్టుకున్న ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

Ntr and kalyan ram emotional on aravinda samethaవందలాది అభిమానుల ముందు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఒక్కసారిగా అరవింద సమేత వేడుక లో నిశ్శబ్దం తాండవించింది. ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ కన్నీళ్ల పర్యంతం కావడంతో నందమూరి అభిమానులు కూడా ఉద్విగ్నా నికి లోనయ్యారు. అభిమాన హీరోలు కన్నీళ్లు పెట్టుకోవడంతో అప్రయత్నంగా నే నందమూరి అభిమానుల కళ్ళలో కూడా నీళ్ల సుడులు తిరిగాయి. ఈ సంఘటన నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగింది. కళ్యాణ్ రామ్ వేదిక మీద మాట్లాడుతూ ” ఏ కూనలో కూలినాడో …. ” అనే పాటని పాడుతూ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఎన్టీఆర్ కూడా ఉద్వేగానికి లోనయ్యాడు.

మా నాన్న వాళ్ళ నాన్న కోసం కష్టపడ్డాడని ,ఆయనలా మరెవరూ కష్టపడలేదని అన్నాడు కళ్యాణ్ రామ్ . ఇక ఎన్టీఆర్ అయితే మా నాన్న ఎప్పుడు కూడా అభిమానుల గురించే ఆలోచిస్తూ వాళ్లే మన దేవుళ్ళు అంటూ చెప్పాడని ఇప్పుడు చెబుతున్నా నా జీవితం మీకే అంకితం అంటూ అశేష అభిమానులను ఉద్దేశించి భావోద్వేగానికి లోనయ్యాడు ఎన్టీఆర్.

English Title: Ntr and kalyan ram emotional on aravinda sametha

Thanks! You've already liked this