విజయ్ దేవరకొండ కోసం పోటీపడుతున్న దర్శకులు

Tollywood directors eagerly waiting for vijay devarakondaహ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలని ఉత్సాహపడుతున్నారు. ఇదే విషయాన్ని నోటా పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు కొరటాల శివ. పెళ్లి చూపులు చిత్రం చూసి ఒక కథ చెప్పాలి , విజయ్ తో సినిమా చేయాలని అనుకున్నాను అయితే అర్జున్ రెడ్డి చూసాక ఒకలా అనుకున్నాను ఇటీవలే గీత గోవిందం చూసాను ఇక తాజాగా నోటాతో మనముందుకు వస్తున్నాడు , ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కోసం మంచి కథ రెడీ చేసి అతడ్ని కలుస్తాను , సినిమా చేస్తానని అన్నాడు కొరటాల శివ .

ఒక్క కొరటాల శివ మాత్రమే కాదు పలువురు దర్శకులు విజయ్ దేవరకొండతో సినిమాలు చేయడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం అంత త్వరగా ఒప్పుకోవడం లేదు. విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు ఈ హీరో దాంతో అతడితో సినిమాలు చేయాలని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. మరి విజయ్ దేవరకొండ ఎంతమందికి ఛాన్స్ ఇస్తాడో చూడాలి.

English Title: Tollywood directors eagerly waiting for vijay devarakonda

Thanks! You've already liked this