యాభై రోజులు పూర్తిచేసుకున్న గీత గోవిందం

Vijay devarakonda's geetha govindam completes 50 daysవిజయ్ దేవరకొండరష్మీక మందన్న జంటగా పరశురాం దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన చిత్రం గీత గోవిందం. ఆగస్ట్ 15న విడుదలైన గీత గోవిందం సంచలన విజయం సాధించింది. కనీవినీ ఎరుగని రీతిలో 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 125 కోట్ల గ్రాస్ వసూళ్ల ని 65కోట్ల షేర్ ని సాధించి ప్రభంజనం సృష్టించింది. చిన్న చిత్రంగా విడుదలైన గీత గోవిందం ఈరోజుకి దిగ్విజయంగా 50 రోజులను పూర్తిచేసుకుంది. దాంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది. రెండు , మూడు వారాలు ఆడటమే గొప్ప అనుకునే ఈరోజుల్లో ఏకంగా ఏడు వారాలను పూర్తిచేసుకుని యాభై రోజులకు చేరువ అవడం గొప్ప విషయమే మరి.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లు సాధించి పలువురు అగ్ర హీరోలకు ఛాలెంజ్ విసిరాడు విజయ్ దేవరకొండ. గీత గోవిందం చిత్రంలో విజయ్ -రష్మీక ల జోడి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. డైరెక్టర్ పరశురాం కు కూడా ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది గీత గోవిందం . తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన గీత గోవిందం భారీ లాభాలను తెచ్చిపెట్టడంతో చిత్ర బృందానికి పలు రకాల గిఫ్ట్ లు ఇచ్చారు గీతా ఆర్ట్స్ 2 వర్గాలు.

English Title: Vijay devarakonda’s geetha govindam completes 50 days

Thanks! You've already liked this