త్రిపుర లో దారుణం — సామూహిక హత్యాచారం

అక్కాచెల్లెళ్లను అపహరించి, వారిపై సామూహిక అత్యాచారం జరిపిన ఘటన త్రిపురలోని ఉనాకోటి జిల్లాలో చోటుచేసుకుంది. ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం, ఈనెల 9న అక్కాచెల్లెల్లు ఇద్దరూ అగర్తలాకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైలాషహర్ పట్టణం సమీపంలోని ఓ బ్రిడ్జి వద్ద ఇంటికి వెళ్లడం కోసం వాహనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఓ ఆటో వచ్చి వారి ముందు ఆగింది. అందులో డ్రైవర్ తో పాటు, మరో ఇద్దరు పురుష ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ తెలిసిన వ్యక్తే కావడంతో, బాధితులు ఇద్దరూ ధైర్యంగా ఆటోలో ఎక్కారు. ఆటో బయల్దేరిన వెంటనే… ఆటోలోని ప్రయాణికులు ఇద్దరూ అక్కాచెల్లెళ్ల తలలను టవాళ్లతో చుట్టేశారు. ఆ తర్వాత ఆటోను డ్రైవర్ తెలిముర పట్టణానికి తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరిపై రెండు రోజుల పాటు సామూహికంగా అత్యాచారం చేశారు. రెండు రోజుల తర్వాత వారిని వదిలిపెట్టారు. జరిగిన దారుణాన్ని బాధితురాళ్లు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

The post త్రిపుర లో దారుణం — సామూహిక హత్యాచారం appeared first on APDunia.

Thanks! You've already liked this