సన్నీలియోన్ కు మద్దతుగా నిలిచిన విశాల్

బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ప్రధాన పాత్రలో ‘వీరమహాదేవి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు వ్యతిరేకంగా కొన్ని కన్నడ, తమిళ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ఇటీవల బెంగళూరులో సన్నీ లియోన్ పాల్గొన్న ఓ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సైతం కన్నడ సంఘాలు యత్నించాయి. ఇలాంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రంలో సన్ని లియోన్ వంటి శృంగార తార నటించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం ఇక్కడితో ఆగిపోలేదు. వీరమహాదేవి చిత్రానికి వ్యతిరేకంగా కొందరు తమిళనాడులో న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సన్నీలియోన్ కు కోలీవుడ్ హీరో విశాల్ మద్దతుగా నిలిచారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా రీమేక్ ‘అయోగ్య’లో విశాల్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం చిత్రీకరిస్తున్న ప్రత్యేక గీతంలో సన్నీ లియోన్ కు విశాల్ ఛాన్సిచ్చారు. తమిళ టెంపర్ లో విశాల్ కు జోడీగా రాశిఖన్నా నటిస్తోంది.

The post సన్నీలియోన్ కు మద్దతుగా నిలిచిన విశాల్ appeared first on APDunia.

Thanks! You've already liked this