జనసేనలో చేర‌నున్న కృష్ణంరాజు స‌తీమ‌ణి

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాత్ర‌లో భాగంగా ప‌లు జిల్లాలు ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక‌ యాత్ర‌లో భాగంగా జ‌న‌సేన నిర్వ‌హిస్తున్న స‌భ‌ల్లో ప‌వ‌న్.. టీడీపీ, వైసీపీల పై విరుచుకు ప‌డుతూ జ‌న‌సేన మైలేజ్ పెంచుకుంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాప‌క్ అవుతున్నారు. ఈ క్ర‌మంలో చాలా మంది నాయ‌కులు జ‌న‌సేన వైపు చుస్తున్నారు. ఇటీవ‌ల ఉమ్మ‌డి మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ జ‌న‌సేన‌లో చేరిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత కూడా ప‌లువురు నేత‌లు జ‌న‌సేన‌లో చేరారు. అయితే ఇప్పుడు తాజాగా బీజేపీ నేత రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి జ‌న‌సేన‌లో చేర‌నున్నార‌నే వార్త‌లు రెండు మూడు రోజులుగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆమె జ‌న‌సేన త‌రుపున‌ న‌ర‌సాపురం అసెంబ్లీ నుండి పోటీ చేయ‌నున్నార‌ని.. ఈ విష‌యం పై చ‌ర్చ‌లు కూడా పూర్తి అయ్యాయ‌ని తెలుస్తోంది. మ‌రి ఈ వార్త‌లో నిజ‌మెంత ఉందో తెలియ‌దు కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం ర‌చ్చ లేపుతోంది.

The post జనసేనలో చేర‌నున్న కృష్ణంరాజు స‌తీమ‌ణి appeared first on APDunia.

Thanks! You've already liked this