కన్నతండ్రే కాటేసిన ఘటన

కామంతో మదమెక్కిన కన్నతండ్రి కంటికి రెప్పలా కాపాడాల్సిన కుమార్తెపై అత్యాచారానికి తెగబడ్డాడు. భార్య ఇంట్లో లేని సమయం చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తండ్రి దుశ్చర్యతో నిర్ఘాంతపోయిన ఆ మైనర్ బాలిక… జరిగిన ఘోరాన్ని కన్నతల్లికి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ లంగర్‌హౌస్ ప్రాంతానికి చెందిన 50 యేళ్ళ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో వయసుకొచ్చిన 16 యేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతూ పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

The post కన్నతండ్రే కాటేసిన ఘటన appeared first on APDunia.

Thanks! You've already liked this