పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి
పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడులు చేసింది.ఈరోజు తెల్లవారుజూమున 3:30 గంటలకు ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై బాంబులతోభారత వైమానిక బృందం భీకర దాడి చేసింది. సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్రక్యాంపులను ధ్వంసం చేసింది. 12 మిరాజ్200 జైట్ ఫైటర్స్‌తో ఈ దాడి చేపట్టారు. ఈ నేపథ్యంలో భారత్, పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వైమానిక దళం చేపట్టిన ఈ దాడులు వంద శాతం విజయవంతమయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం దాడులు అనుకున్నట్లు జరిగాయని తెలిపారు.
Related Images:
The post పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి appeared first on Netivaartalu.