రైతుల సం క్షేమానికి ప్రభుత్వ కృషి

– కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
– పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి
సుల్తానాబాద్‌ : రైతుల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో కొనుగోలు కేం ద్రాన్ని జేసీ వనజాదేవితో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి రైతుల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారని, దేశంలో ఏ ప్రభుత్వాలు చేపట్టనటువంటి రైతుబంధును అందించి అన్నదాతను రాజును చేయాలనే సంకల్పంతో రూ. 10వేలను అందిస్తున్నారన్నారు. రైతులు పెట్టుబడి కోసం ఎవరి వద్దకు అప్పు చేయవద్దనే సంకల్పంతోపాటు పండించిన ధాన్యానికి మద్దతు ధర కోసం మూడు గ్రామాలకో కొనుగోలు కేంద్రం ఐకేపీ, పీఏసీఎస్‌, ఏజెన్సీల ద్వారా చేపడుతున్నారన్నారు. విక్రయించిన ధాన్యానికి డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారన్నారు. అలాగే పురుగులమందు నుంచి మొదలుకొని యూరియా, సేద్యానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలను అందిస్తూ రైతులకు భరోసా ఇస్తున్నారన్నారు. గతంలో ప్రభుత్వాలు చేయలేని సంక్షేమ కార్యక్రమాలను వారికి అందించి రైతు అభివృద్ధికి పాటు పడుతున్నారన్నారు. జేసీ వనజాదేవి మాట్లాడుత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి నేరుగా ఖాతాలో డబ్బులు జమ చేసి అన్నదాతను ఆదుకుంటుందన్నారు. పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, జడ్పీటీసీ మినుపాల స్వరూప ప్రకాశ్‌రావు, సింగిల్‌ విండో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, మినుపాల ప్రకాశ్‌రావు, గుర్రాల మల్లేశం, ముత్యం రమేశ్‌, బుర్ర శ్రీనివాస్‌, పల్లా సురేశ్‌, రైస్‌మిల్లర్స్‌ పల్లా మురళీధర్‌తోపాటు సొసైటీ కార్యదర్శి బూరుగు సంతోష్‌తోపాటు రైతులు, మార్కెట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Thanks! You've already liked this