ఉత్పత్తి విధానం – ఉత్పత్తి సంబంధాలు

మర్ల విజయ కుమార్‌
పారిశ్రామిక విప్లవం యూర ప్‌లో ముఖ్యంగా ఇంగ్లాండులో ప్రారంభమై ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఈ విప్లవం మూడు ప్రధానమైన దశలను దాటి నేడు నాలుగవ దశలోకి ప్రవేశిస్తున్నది. మొదటి దశలో జంతు, మానవ శ్రమ ఆధారంగా వస్తూత్పత్తి జరు గుతుండేది. జల, వాయు శక్తిని కూడా ఉపయోగించేవారు. పెరుగుతున్న మార్కెట్లకు సరుకులు ఉత్పత్తి చేయటానికి అంత కంటే ఎక్కువ శక్తి వనరులను ఉపయోగించవలసి వచ్చింది. దీనితో ఆవిరిశక్తి ప్రధానమైన వనరు అయింది. అదే సమ యంలో వస్తూత్పత్తికే కాకుండా నీటిపై, భూమిమీద సరుకుల రవాణాకు ఆవిరి శక్తిని ఉపయోగించటం ప్రారంభమైంది. 19వ శతాబ్దం అంతం నాటికి ఉక్కు ఉత్పత్తి వాడకం బ్రహ్మాండంగా పెరిగి ప్రపంచ రూపురేఖలే మారిపోయాయి. ఖండాంతరంగా రైలు మార్గాలు, మైళ్ళ నిడివి గల బ్రిడ్జిలు వెలిశాయి. స్టీలు, సిమెంటు కాంక్రీటుతో నిర్మించిన బహుళ అంతస్థుల భవనాలు, పెద్దపెద్ద ఫ్యాక్టరీలు వెలిశాయి. ఇది పారిశ్రామిక విప్లవం తొలిదశగా లెక్క వేస్తారు. ఆ తరువాత విద్యుత్‌ శక్తి వినియోగం, ప్లాస్టిక్‌, అల్యూమిమినం వాడకంతో పారిశ్రామిక ఉత్పత్తిలో బ్రహ్మాండమైన అభివద్ధి జరిగింది. మార్కెట్లు ప్రపంచవ్యాప్త మయ్యాయి. మోటారు వాహనాలు సర్వవ్యాప్తమయ్యాయి. 1970 దశకం వరకూ పారిశ్రామిక విప్లవం రెండవ దశగా గుర్తి స్తారు. 1900 నాటికి రూపుదిద్దుకున్న సమాచార వ్యవస్థ, టెలి ఫోన్‌, రేడియో, ఆ తరువాత టెలివిజన్‌ అవతరణతో ప్రపంచస్థాయి మార్పులకు తెరతీసింది.
మనం ప్రస్తుతం పారిశ్రామిక విప్లవం మూడవ దశలో ఉన్నామని ఆర్థిక వేత్తలు చెపుతున్నారు. గుత్త సంస్థలు బహుళ జాతి కంపెనీలుగా ఎదిగి, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయి. పరిశ్రమలు పెద్దవైనప్పుడు, అందులోని ఉత్పత్తి క్రమం కూడా సంక్లిష్టం కావచ్చింది. 20వ శతాబ్దపు రెండవ భాగంలోకి ప్రవేశించేసరికి, రెండవ ప్రపంచ యుద్ధం వలన జరిగిన వినా శనం నుండి కోలుకొన్న ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు విస్తరణ దశలో ఉన్నాయి. భారీ యంత్రాల వాడకం పరిశ్రమలలో సర్వవ్యాప్తమైంది. ఉత్పత్తి, వితరణ, పంపిణీ రంగాలు ఖండాతర స్థాయికి ఎదిగి, ప్రపంచదేశాల మధ్యన వ్యాపారం, ఎగుమతులు, దిగుమతులు ఊపందుకున్నాయి. సామ్రాజ్యవాదం నుండి విముక్తి పొంది, కొత్తగా స్వాతంత్య్రం పొందిన ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలు త్వరితగతిని పారిశ్రామికీకరణ ద్వారా తమతమ ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకుందుకు ప్రయ త్నాలు ప్రారంభించాయి. పెట్టుబడులకు, సాంకేతిక పరిజ్ఞానా నికి ధనిక సామ్రాజ్యవాద దేశాలపై వీరు ఆధారపడక తప్పలేదు. పారిశ్రామిక దేశాలలో ఫైనాన్స్‌ పెట్టుబడులు ఇతర ఆర్థిక రంగాలపై పట్టు సాధించటం మొదలైంది. ఈ కాలంలోనే పెద్ద పెద్ద పరిశ్రమల, ఇతర వ్యాపార సంస్థల నిర్వహణ సంక్లిష్ట మవటంతో కొత్త యాజమాన్య పద్ధతులు అమలులోకి వచ్చాయి. ఖండాంతరంగా విస్తరించి, అనేక ఉత్పత్తి పరిశ్రమలు, రవాణా సదుపాయాలు తమ అధీనంలో పెట్టుకొన్న బహుళ జాతి సంస్థలలో వివిధ స్థాయిలలో కార్యకలాపాల నిర్వహణ కోసం వేరువేరు విభాగాలు ఏర్పడ్డాయి. ఒక క్రొత్త వస్తువును తయారు చెయ్యాలనే అలోచన నుండి దాని తయారీ మధ్యన అనేక స్థాయిలలో కషి జరగవలసి వున్నది. ఈ యంత్ర నిర్మాణ ప్రక్రియలో అనేక స్థాయిలలో నిపుణుల మధ్యన చర్చలు, వాదోప వాదాలు, పరస్పర అంగీకారం కోసం సమావేశాలు జరగనిదే తయారీ పూర్తి కాదు. ఈ విధమైన ఉత్పత్తి ప్రక్రియలో అనేక రంగాలలోని నిపుణులు తమ నైపుణ్యాన్ని ఉపయోగించి కషి చేయవలసి ఉంటుంది. అనేక విభాగాల పని తీరును నియం త్రించే మేనేజిమెంటు వివిధ స్థాయిలలో పనిచేయాలి. ఈ విభాగాలన్నీ వస్తూత్పత్తి విభాగానికి సహాయకారిగా పనిచేస్తాయి. రానురాను ఈ ఇతర విభాగాల భారం పెరిగిపోయి, తయారయే వస్తువుల ఖర్చుకు ఓవర్‌హెడ్‌గా అయి, వస్తువుల తయారీ ఖర్చు పెరిగిపోనారంభించింది. 1970 దశకంలో ఈ ఓవర్‌ హెడ్‌ ఖర్చులను తగ్గించుకునే ప్రక్రియలో యజమాన్య పద్ధతులలో అనేక మార్పులు, కొత్త విధానాలు ప్రవేశపెట్టబడ్దాయి.
కన్వేయర్‌ బెల్టు విధానం, జస్ట్‌-ఇన్‌-టైమ్‌, కాన్‌ బాన్‌, కీరెట్సు, రీ ఇంజనీరింగ్‌ వంటి ప్రక్రియల ద్వారా వ్యాపార ప్రక్రి యను వేగవంతం చేసి, త్వరితగతిన తక్కువ ఖర్చుతో సరుకు లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టటానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రక్రియలో, ఎక్కువ స్థాయిలో ఆటోమేటిక్‌ యంత్రాలను ప్రవేశపెట్టి, వివిధ విభాగాలలోని ఉద్యోగుల, కార్మికుల సంఖ్యను తగ్గించుకుంటోంటే, పెట్టుబడిలో నిర్జీవ శాతం పెరిగి (అంటే యంత్రాలు) జీవ శాతం (ఉద్యోగులు, కార్మికులు) తగ్గ నారంభించింది. ఉత్పత్తి, ఇతర వ్యాపార ఖర్చులు తగ్గించుకు నేందుకు జరిగిన కషి ఫలితంగా, పరిశ్రమ లేదా వ్యాపారంలోని వివిధ భాగాల పనితీరును క్షుణ్ణంగా పునరాలోచించి ఖర్చుతో కూడిన, లాభదాయకం కాని పనులను ఇతరులకు సబ్‌ కాంట్రాక్ట్‌ ఇవ్వటం ద్వారా ఖర్చులు ఆదా చేసుకోవటం మొదలైంది. అప్పటికే పరిశ్రమలలో, వ్యాపారాలలో కంప్యూటర్ల వాడకం మామూలు విషయమైంది. వివిధ డిపార్ట్‌మెంట్ల మధ్య గల పరస్పర సంబంధాలను కంప్యూటర్‌ ప్రోగ్రాముల, డేటాబేస్‌ల సహాయంతో, సమన్వయం చేయగలగటం ప్రారంభమైంది. ఒక డిపార్ట్‌మెంటులో విషయాలు, సంబంధిత డిపార్ట్‌మెంటులకు ఇ మెయిల్‌ ద్వారా పంపే ప్రక్రియ మొదలైంది. ఇక దాని పర్యవ సానంగా ఒక కంపెనీలోని మొత్తం ఉత్పత్తి, వ్యాపార ప్రక్రియలను సాఫ్ట్‌వేర్‌ ద్వారా నిర్వచించగలిగిన అవకాశం ”సాప్‌” వంటి సాఫ్ట్‌వేర్‌ సహాయంతో సాధ్యపడింది. మేనేజి మెంట్‌ ప్రతీ స్థాయిలో ఎవరికి అవసరమైన సమాచారం వారికి క్షణాలలో అందజేయగలగటంతో నిర్ణాయక ప్రక్రియ వేగవంత మైంది. ఈ విధంగా మొత్తం వ్యాపార ప్రక్రియను కంప్యూటరీ కరణ చేయటం ద్వారా నష్టాలను, వధాను తగ్గించుకుని లాభా లను పెంచుకునే అవకాశం లభించింది. నెట్‌వర్క్‌లో కంప్యూ టర్లు అనుసంధానం కావటంతో, సబ్‌ కంట్రాక్టర్లకు ఆర్డర్లు క్షణాలమీద అందజేయటం, ఏయే విడిభాగాలు ఏ నిము షానికి ఫ్యాక్టరీకి చేరతాయో తెలుసుకోగలిగారు. ప్రపంచ వ్యాప్తంగా సబ్‌ కంట్రాక్టర్ల నుండి ఆఫ్‌ షోరింగ్‌ ద్వారా విడిభాగాలు, సర్వీసులు పొందే అవకాశం ఏర్పడింది. ఈ విధంగా మొత్తం వ్యాపార ప్రక్రియను మోడల్‌ చేయటం ద్వారా ఆ ప్రక్రియలోని కీలక భాగాలను ఆటోమేటిక్‌ యంత్రాలతో నడపటానికి, తద్వారా కార్మికులను తగ్గించుకోవటానికి అవకాశం ఏర్పడింది. తద్వారా ఉత్పత్తిలో ఆటోమేషన్‌కు మార్గం సుగమమైంది.
1950, 60 దశకాలలో సర్వీసురంగం ప్రాధాన్యతను సంతరించుకున్నది. సబ్‌ కంట్రాక్టర్లకు రిటైల్‌ అమ్మకాలు, కస్టమర్‌ సర్వీసు వంటి శ్రమతో కూడిన పనులను అప్పజెప్పటం ద్వారా కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను పరిమితం చేసుకో గలిగారు. 80వ దశకంలో ప్రపంచీకరణ కారణంగా ఆఫ్‌ షోరింగ్‌ ప్రక్రియ అమలులోకి రావటంతో, మూడవ ప్రపంచ దేశాలలో చవకగా లభించే కార్మికులను ఉపయోగించి, లాభా లను వద్ధి చేసుకోవటం సాధ్యపడింది. అదేకాలంలో కంప్యూ టర్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలలో వచ్చిన బ్రహ్మాండమైన అభివద్ధిని ఉపయోగించుకుని, తమ కంపెనీలలో చేసే చాలా పనులను ఆఫ్‌ షోరింగ్‌కు అప్పచెప్పటం లాభదాయకంగా మారింది. భారత్‌ వంటి మూడవ ప్రపంచ దేశాలలో హైదరా బాద్‌, బెంగుళూరు, పూనా, గుర్‌ గావ్‌ వంటి నగరాలలో ఐటి పరిశ్రమ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ”లీన్‌ మానుఫాక్చ రింగ్‌” పేరున కంపెనీలో డైరెక్టుగా అతి తక్కువ పని చేసి, మొత్తం వ్యాపార కార్యకలాపాలు ఆఫ్‌ షోరింగ్‌కు, సబ్‌ కంట్రాక్టులకు అప్పగించటం ద్వారా, 20, 30 మంది ఉద్యోగుల తో వేల కోట్ల డాలర్ల వ్యాపారం చేసే నైకె, ఆడిదాస్‌, ఆపిల్‌ వంటి కొత్త తరం కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఆటోమేషన్‌ కారణంగా ఉత్పత్తి ప్రక్రియలో కార్మికుల సంఖ్య తగ్గినా, సర్వీసు రంగం పెరగటంతో, కొంతవరకూ కొత్త ఉద్యోగాల కల్పన జరిగి, ఆర్థిక వ్యవస్థ సజావుగా కాకపోయినా, పెద్ద సంక్షోభాలు లేకుండా పనిచేయగలిగింది. ఫైనాన్స్‌ రంగం కూడా విపరీతంగా పెరగటంతో అక్కడకూడా ఉద్యోగావకాశాలు మెరుగుపడ్డాయి. 2008లో అమెరికా ఆర్థిక వ్యవస్థ ‘సబ్‌ ప్రైమ్‌ క్రైసిస్‌’ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవటంతో సర్వీసు, ఫైనాన్స్‌ రంగాలు కుదేలయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి పరిశ్రమలు విదేశాలకు తరలిపోయినా, ఈ రంగాలు పెరగటంతో అంతా సజావుగా ఉన్నదనే భ్రమ కల్పించారు. కమ్యూనిస్టు మానిఫెస్టో లో మార్క్స్‌, ఎంగెల్స్‌లు వివరించినట్లుగా, నిరంతరం పోటీని ఎదుర్కొంటూ, వ్యాపారాన్ని, తద్వారా లాభాలను విస్తరించుకోనిదే పెట్టుబడిదారునికి ఉనికి లేదు. ఈనాడు ఆటోమేషన్‌ కారణంగా సర్వీసు రంగంలో కూడా ఉద్యోగావకాశాలు సన్నగిల్లిపోతుం డటంతో, ఆఫ్‌ షోరింగ్‌ కంటే చవకగా సాఫ్ట్‌వేర్‌ రోబోలను వినియోగించి పని చేసుకొనే అవకాశం ఏర్పడ్డది. దీనితో మూడ వ ప్రపంచ దేశాలలోని ఐటి రంగం మూతపడే ప్రమాదం ముంచుకొస్తున్నది. గ్లోబలైజేషన్‌ పేరున ప్రపంచ వ్యాప్తంగా విస్త రించి పేద దేశాల శ్రమశక్తిని చౌకగా దోచుకుని బహుళజాతి సంస్థలు విపరీతమైన స్థాయిలో లాభాలు మూటగట్టుకుని అమె రికాకు తరలించారు. కాని ఉద్యోగాలు పోయి ప్రజలలో తీవ్ర అసంతప్తి నెలకొనటంతో రాజకీయ అవసరాల కోసం రక్షిత విధానాలను ప్రోత్సహించి, పరిశ్రమలన్నీ తిరిగి అమెరికాకు తరలి వస్తాయని నమ్మబలికి ట్రంప్‌ గద్దె నెక్కాడు. అమెరికాకు పరిశ్రమలు, వ్యాపారాలు తరలి రావటానికి అమెరికన్‌ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో కొత్త వ్యాపారాలు ప్రారంభించినా కొత్త ఉద్యోగాల కల్పన జరుగలేదు. ఆటోమేషన్‌తో ఖర్చులు తగ్గించు కుందుకు పెట్టుబడిదారులు ప్రయత్నిస్తున్నారు. దాని ఫలితంగా నిరుద్యోగం మరింత పెరిగిపోయి ప్రజల కొనుగోలు శక్తి దిగ జారుతున్నది. ఇటు పరిశ్రమలు తమతమ దేశాలనుండి తరలి పోతే, బడుగు దేశాల ఆర్థిక వ్యవస్థలు క్షీణిస్తున్నాయి. ఈ అన్ని కారణాల వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చతికిలపడింది. కరోనా ఆంక్షలతో పరిస్థితి మరింత దిగజారి, అచేతన స్థితికి చేరింది.
పారిశ్రామిక విప్లవం మూడవ దశ పూర్తి కావస్తున్న ఈ రోజుల్లో, పారిశ్రామిక ఉత్పత్తిలో రోబోల వినియోగం పెరిగి, కార్మికుల సంఖ్య దారుణంగా పడిపోతున్నది. ఇక సర్వీసు రంగం, రవాణా, వితరణ రంగాలలో కూడా ఈ ఆటోమేషన్‌ కారణంగా ఉద్యోగాలు తగ్గిపోయి, మొత్తం ఆర్థిక వ్యవస్థ అసలు మానవ ప్రమేయం లేకుండా పనిచేయగలిగే పరిస్థితులు వస్తు న్నాయి. ఈ పారిశ్రామిక ఉత్పత్తి విధానంలో జరిగిన అభివద్ధి, సర్వీసు రంగంలో మార్పులు శాస్త్ర సాంకేతిక అభివద్ధి కార ణంగా సాధ్యమయ్యాయి. భవిష్యత్తులో కూడా మరిన్ని మార్పులు చోటుచేసుకోవచ్చును. అయితే, ఈ మార్పును తిరగదోడే అవ కాశం లేదు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో చోటు చేసుకుంటూన్న ఈ మార్పులు ఆ వ్యవస్థను పతనం దిశగా తీసు కెళ్తున్నాయని, ఈ ఆటోమేషన్‌ అనే ఊబిలో కూరుకుపోయిన ఈ దోపిడీ వ్యవస్థ కుప్పకూలటం తధ్యమని అనేకమంది బూర్జువా ఆర్థ్ధిక వేత్తలే హెచ్చరిస్తున్నారు. జనాభాలో అధిక శాతం ప్రజలు ఆర్థ్ధిక వ్యవస్థకు అనవసరమైనప్పుడు, ఏ విధమైన ఆర్థిక, సామా జిక సమస్యలు, అస్థిరత తలెత్తుతాయనే విషయాన్ని మనం పరిశీ లించవలసి ఉన్నది.
వ్యాస రచయిత : అఖిల భారత అభ్యుదయ వేదిక జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, 9848933545

Thanks! You've already liked this