కంగనా ఇంటి సమీపంలో కాల్పుల కలకలం

బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ ఇంటికి సమీపం లో కాల్పుల కలకలం రేగింది. మనాలి లోని తన ఇంటి వద్ద కాల్పులు జరటంతో ఒక్క సారిగా అలెర్ట్ అయిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కంగనాకు రక్షణ కల్పించారు. ఘటన జరిగిన సమయంలో కంగనా ఇంటిలోనే ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ ఘటన పై కంగనా మాట్లాడుతూ తొలుత అవి తుపాకీ చప్పుళ్లు అని అర్థం కాలేదని, అయితే రెండో సారి కూడా వినపడడంతో అర్థం చేసుకున్నానని చెప్పారు. స్థానికులకు డబ్బు ఆశ చూపించి ఎవరో తనను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉందని కంగన ఆరోపించారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

The post కంగనా ఇంటి సమీపంలో కాల్పుల కలకలం appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.

Thanks! You've already liked this