ట్రంప్‌ పాలనలో ఆర్థికం అధ్వాన్నం

అమెరికా ఆర్థికవ్యవస్థ ఏనాడూ చవి చూడనంత అధ్వానస్థాయికి చేరుకుంది. 1947 తరువాత ప్రపం చంలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ కలిగిన అమెరికాలో ఆర్థిక స్థితి సంక్షోభంలోకి దిగజారింది. కరోనావైరస్‌ విజృంభించి దేశాన్ని కల్లోలపరుస్తున్న సమ యంలో ఆర్థికవ్యవస్థ దెబ్బ తినడమేకాక కోట్లాది ఉద్యోగాలు ఊడిపోయి నిరుద్యోగులు అల్లాడు తున్నారు. జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) 32.9శాతానికి పడిపోయింది. కరోనా వైరస్‌తో ఇప్పటికే లక్షన్నర మందికి పైగా మరణించారు. ఇటీవలికాలంలో ఉద్యో గాలు ఊడిపోవడం మరింత పెరిగిందని ప్రభుత్వం గురువారం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. కరోనావైరస్‌ రెండవ దశలోనూ విజృంభించింది. అనేక రాష్ట్రాల్లో తిరిగి ఆంక్షలు విధించి ఉద్యోగులను, కార్మికులను ఇళ్లకే పరిమితం చేశారు. ప్రతి వారం నిరుద్యోగ భృతికోసం దరఖాస్తులు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నదనీ, తాజాగా కార్మికశాఖ విడుదల చేసిన సమాచారం స్పష్టం చేసింది. దాదాపు మూడు నెలలకు పైగా ఉద్యోగాలు కోల్పోవడమనేది కొనసాగుతూనే ఉంది. ఈ దశలో మరోసారి ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా అత్యవసర నిధులను మంజూరు చేయవలసిందిగా కాంగ్రెస్‌ పైన ఒత్తిడి వస్తోంది. 2019 మొదటి మూడునెలల కాలంలో ఆర్థిక కార్యకలాపాల కంటే 2020 మొదటి మూడునెలల్లో 9.5శాతం తగ్గిపోయిందనీ, ఇది 1948 తరువాత అత్యంత అధ్వానమని నివేదిక పేర్కొంది.
వేచిచూసే పనిలో వైట్‌హౌస్‌
అదనంగా నిరుద్యోగభృతిని చెల్లించే విషయంలో కనీసం ఒక వారంపాటు వైట్‌హౌస్‌ జాప్యం చేస్తున్నదని మీడియా తెలియజేసింది. అలాగే అద్దెలు చెల్లించలేని వారిని ఇళ్లు ఖాళీ చేయించకుండా నిరోధించే విషయమై చర్చలు సాగుతున్నాయి. జులై 25వతేదీతో ముగిసిన వారాంతానికి 10లక్షల 43వేలకు నిరుద్యోగుల భృతికోరుతున్నవారు పెరిగారు. సాధారణంగా ప్రత్యేక కార్యక్రమం కింద భృతికోసం దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య 8లక్షల 29వేల 697 ఉన్నది. కార్మిక మార్కెట్‌ తిరిగి పుంజుకునేందుకు తక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ ఆధ్వర్యంలో ఆర్థికవేత నాన్సీ వన్‌డెన్‌ హౌకెన్‌ విశ్లేషణ తెలియజేస్తున్నది. వినిమయ దారులు ఖర్చు తగ్గించడం, వినియోగించే వస్తువులను తగ్గించడం వలన జీడీపీ ఒక్కసారిగా పడిపోయింది. వినిమయదారుల వ్యయం 34.6శాతం తగ్గింది. గత త్రైమాసికంలో వాణిజ్యం తీవ్రంగా దిగజారింది. ఎగుమతులు 64శాతం తగ్గిపోగా, దిగుమతులు 53.4శాతం తగ్గాయి.
ఆరోగ్యసేవలకు తగ్గిన వ్యయం
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఆరోగ్యభద్రతకు చేసే ఖర్చు బాగా తగ్గిపోయిందని ఆర్థికవేత్తలు అంచనావేశారు. అమెరికా సెంట్రల్‌ బ్యాంకు అధ్యక్షుడు జిరోమ్‌ పోవెల్‌ మాట్లాడుతూ, మన జీవితకాలంలో ఆర్థికరంగం ఇంతగా దిగజారిపోయిన సందర్భం గతంలో ఏనాడూ లేదని చెప్పారు. గృహ యజమానులకు, వ్యాపారులకు మరింతగా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. జీడీపీ ఇంత భారీగా పడిపోవడం విభ్రాంతి కలిగిస్తుందని వాణిజ్యమండలి ప్రధాన విధాన నిర్ణేత నెయిల్‌ బ్రాడ్లీ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 4.9శాతం తగ్గిపోతుందని ఐఎమ్‌ఎఫ్‌ అంచనావేసింది. మరో 600 డాలర్ల అత్యవసర సహాయాన్ని ప్రకటించే అంశంపై కాంగ్రెస్‌ చర్చిస్తున్నది.

Thanks! You've already liked this