కొరటాల – బన్నీ కథ అదేనా?

AA21

కొరటాల శివ ఆచార్య సెట్స్ మీదుండగానే.. అల్లు అర్జున్ తో మరో మూవీని లైన్ లో పెట్టాడు. భరత్ అనే నేను భారీ గ్యాప్ తర్వాత ఆచార్య సినిమా చెయ్యడానికి చాలా టైం తీసుకున్న కొరటాల సేఫ్ సైడ్ గా మరో మంచి కథని తయారు చేసుకుని లాక్ డౌన్ లో దాన్ని డెవెలెప్ చేసి అల్లు అర్జున్ కి వినిపించి ఓకె చేయించుకోవడమే కాదు.. దానిని అధికారిక ప్రకటన కూడా ఇప్పించుకున్నాడు. ఇక అల్లు అర్జున్ – కొరటాల శివ అనౌన్స్ చేసినప్పటినుండి సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. కొరటాల మరోమారు సామజిక అంశాన్నే నమ్ముకున్నాడని ఫస్ట్ లుక్ లోనే అర్ధమైంది. పల్లెటూరికి – పట్నానికి మధ్యన ఉన్న ఆంతర్యాన్ని సంబంధించి ఏదో కొరటాల ఈ సినిమాలో చూపించబోతున్నాడనేది స్పష్టమైంది.

అయితే కొరటాల అల్లు అర్జున్ కోసం రాసిన కథ గురించి సోషల్ మీడియాలో ఓ కథనం ప్రచారంలోకొచ్చింది. మే నెలలో వైజాగ్ లో జరిగిన గ్యాస్ లీకేజి ఉదంతం.. తరుచు తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతునం గ్యాస్ లీకేజి ఘటనలతో కొరటాల ఈ సినిమాని తెరకేక్కిన్చాబోతున్నాడని, ఇలాంటి గ్యాస్ కంపెనీల వలన పల్లెటూర్లు ఎలా కలుషితం అవుతున్నాయో.. వీటిని అడ్డుకోవడానికి స్టూడెంట్ లీడర్ గా అల్లు అర్జున్ ఎలాంటి సాహసాలు చేస్తాడో అనేది ఈ సినిమా నేపథ్యం అంటూ కొరటాల శివ – అల్లు అర్జున్ సినిమా కథ పై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఇప్పుదు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాపై అందరిలో పిచ్చ ఆసక్తి మొదలయింది.

The post కొరటాల – బన్నీ కథ అదేనా? appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this