బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో రెడీ!!

Big boss 4

బిగ్ బాస్ సీజన్ 4 పై రకరకాల ఊహాగానాలు, రకరకాల గాసిప్స్.. వెరసి బిగ్ బాస్  సీజన్ 4 కి రంగం సిద్ధం అయ్యింది. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4 అతి త్వరలోనే స్టార్ మా లో సందడి చేయబోతుంది. బిగ్ బాస్ సీజన్ 3 లో హోస్ట్ గా తన వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న నాగార్జున సీజన్ 4 కి హోస్ట్ గా మారాడు. కరోనా నేపథ్యంలో అతి జాగ్రత్తలతో బిగ్ బాస్ సీజన్ 4 కి స్టార్ మా రంగం సిద్ధం చేసింది. అయితే కరోనా తో గత నాలుగు నెలలుగా మేకప్ లకు దూరంగా ఉన్న నాగార్జున బిగ్ బాస్ సీజన్ 4 యాడ్ షూట్ కోసం మళ్ళీ మేకప్ వేసుకున్నాడు. తాజాగా నాగార్జున బిగ్ బాస్ ప్రోమో కోసం మేకప్ వేసుకున్నాడు. కరోనా తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ ప్రోమో షూట్ లో నాగ్ పాల్గొన్నాడు.

సోగ్గాడే చిన్నినాయనా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సెంథిల్ కుమార్ కెమెరా మ్యాన్ గా తెరకెక్కిన బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో త్వరలోనే బుల్లితెర మీదకి రాబోతుంది. నాగార్జున మేకప్ వేసుకుని ప్రోమో షూట్ కోసం రేడి అయినా పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నాగార్జున కి భారీ పారితోషకం ఇచ్చి బిగ్ బాస్ హోస్ట్ గా ఒప్పించిన స్టార్ మా ఈసారి బిగ్ బాస్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటుంది. షోకి సంబందించిన కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా ఫైనల్ అయ్యింది అని.. 100 రోజుల్ బిగ్ బాస్ ని 50 రోజులకే కుదించిన స్టార్ మా.. వాళ్ళ కోసం కరోనా  ఇన్సూరెన్స్ లు చేయించడం దగ్గరనుండి కోవిడ్ పరీక్షలు చేయించేవరకు జాగ్రత్తలు తెలుసుకుంటుంది. ఇక కరోనా తో అసలు బిగ్ బాస్ సీజన్ 4 ఉంటుందో లేదో అనుకుంటున్న తరుణంలో స్టార్ మా అన్నిటిని అధిగమించి బిగ్ బాస్ ప్రోమో వరకు తీసుకొచ్చింది. 

The post బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో రెడీ!! appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this