వాళ్లంతా అంత స్పీడుగా ఉన్నారు.. కానీ చరణ్ మాత్రం!!

కరోనా

టాలీవుడ్ హీరోలంతా యమా స్పీడు మీదున్నారు. ఒక సినిమా సెట్స్ మీదుండగానే మరో సినిమాని లైన్ లో పెట్టేస్తున్నారు. టాప్ దర్శకులకు ఒక్క క్షణం తీరిక ఉండడం లేదు. స్టార్ హీరోలకు కథలు చెప్పి వాళ్ళని కమిట్ చేయించేస్తున్నారు. రాజమౌళి తో సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా పూర్తికాకుండానే త్రివిక్రమ్ తో ఒక సినిమా అలాగే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరో సినిమాని లైన్ లో పెట్టుకున్నాడు. ఇక మహేష్ బాబు పరశురామ్ తో సర్కారు వారి పాట తర్వాత పక్కాగా రాజామౌళితోనే సినిమా చేస్తాడు. ఆ విషయం రాజమౌళి ధృవీకరించాడు కూడా. ఇక ప్రభాస్ రాధే శ్యాం సెట్స్ మీదుండగానే నాగ్ అశ్విన్ తో మరో పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టాడు. అలాగే పుష్ప తో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్న అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ కూడా అధికారికంగా సెట్ అయ్యింది.

కొరటాల శివ తో అల్లు అర్జున్ తన AA21 మూవీని లైన్ లో పెట్టేసాడు. మరి హీరోలంతా ఇలా అడ్వాన్స్ గా సినిమాలు లైన్ లో పెట్టుకుని సేఫ్ గేమ్ ఆడుతుంటే.. మెగా హీరో రామ్ చరణ్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చున్నాడు. అస్సలు కరుకు లేకుండా RRR సినిమా చేస్తున్నాడు. ఆచార్య సినిమా నిర్మిస్తూ అందులో గెస్ట్ రోల్ చేస్తున్నాడు కానీ నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇవ్వడం లేదు. రామ్ చరణ్ నెక్స్ట్ డైరెక్టర్స్ లిస్ట్ చాంతాడంత ఉంది కానీ.. అందులో ఏ డైరెక్టర్ కి కమిట్ అయ్యాడో రామ్ చరణ్ చెప్పాడు. వంశి పైడిపల్లి, వెంకీ కుడుములు, కొత్త దర్శకుడు గోపాల కృష్ణ లు రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ లిస్ట్ లో ఉన్నారు. కాని చరణ్ ఎవరికీ ఓకె చెబుతాడో అనే క్యూరియాడిసిటి మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుంది.  

The post వాళ్లంతా అంత స్పీడుగా ఉన్నారు.. కానీ చరణ్ మాత్రం!! appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this