సినిమా సన్నివేశాన్ని పోర్న్ సైట్లో పెట్టేసి..

సినిమా సన్నివేశాన్ని పోర్న్ సైట్లో పెట్టేసి..

ఆ అమ్మాయి ఒక లా స్టూడెంట్. చక్కగా చదువు మీద దృష్టిపెట్టి సాగిపోతోంది. ఐతే ఆ అమ్మాయికి తెలిసీ తెలియని వయసులో ఓ సినిమాలో నటించింది. అందులో ఓ అభ్యంతరకర సన్నివేశం చేసింది. ఆ తర్వాత సినిమాల్లో కొనసాగలేదు. చదువు మీదే దృష్టిసారించింది. ఐతే అప్పట్లో నటించిన సన్నివేశం ఇప్పుడు పోర్న్ వెబ్ సైట్లో ప్రత్యక్షమైంది. ఏదో ఒక వల్గర్ క్యాప్షన్‌తో ఆ వీడియోను పోస్ట్ చేశారు. అది ఆ అమ్మాయి సహచర విద్యార్థులు చూసి తనను వేధించడం మొదలుపెట్టారు. వాళ్లే కాక ఆ అమ్మాయికి తెలిసిన వేరే వ్యక్తులు సైతం పోర్న్ వెబ్ సైట్లో ఆ వీడియో చూసి తనను సోషల్ మీడియాలో వేధించడం మొదలుపెట్టారు. కొన్నేళ్లుగా ఈ వేధింపులు భరిస్తూ వచ్చిన ఆ అమ్మాయి.. ఇప్పుడు తట్టుకోలేక బరస్ట్ అయింది.

‘కాదల్’ (తెలుగులో ప్రేమిస్తే)లో కథానాయికగా నటించిన సంధ్య ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమా పేరు.. ఫర్ సేల్. మలయాళ, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో సంధ్య చెల్లెలిగా నటించిందో అమ్మాయి. యుక్త వయసులో ఇంటర్నెట్ స్నేహాలకు అలవాటు పడితే తలెత్తే ఇబ్బందుల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. ఇందులో సదరు అమ్మాయి తనకిష్టం లేకుండానే ఓ సన్నివేశంలో నటించిందట. ఆ సన్నివేశం తాను చేయలేనని దర్శకుడికి చెప్పగా.. కాస్ట్ అండ్ క్రూ అందరినీ బయటికి పంపించి ప్రైవేట్‌గా షూట్ చేశాడట. అదేమీ న్యూడ్ సీన్ కాదు. కానీ కొంత అభ్యంతరకరంగా ఉంటుంది. ఆ సన్నివేశం చేసే సమయానికి తన వయసు 14 ఏళ్లే అని.. అయిష్టంగానే, ఆ సన్నివేశం గురించి పూర్తిగా తెలియకుండానే అందులో నటించానని.. ఐతే ఈ సన్నివేశానికి సంబంధించి తర్వాతి ఏళ్లలో చాలా ట్రోలింగ్ ఎదుర్కొన్నానని.. మానసిక వేదన అనుభవించానని.. ఇప్పుడు ఎవరో ఆ సన్నివేశాన్ని పోర్న్ వెబ్ సైట్లో పెట్టడంతో తన పరిస్థితి దారుణంగా తయారైందని చెబుతూ కన్నీటి పర్యంతమవుతూ ఒక వీడియో పెట్టింది ఆ అమ్మాయి. ఏదో వీడియో చూసి ఒక అమ్మాయి మీద ఒక జడ్జిమెంట్ పాస్ చేయడం కరెక్ట్ కాదని, తనను వేధించడం ఆపాలని ఆ అమ్మాయి విజ్ఞప్తి చేసింది.

Thanks! You've already liked this