నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ కావరత్తి

యాంటీ సబ్‌మెరైన్‌ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ కావరత్తి విశాఖపట్టణంలోని నౌకాశ్రయంలో జలప్రవేశం చేసింది. 90 శాతం స్వదేశీయంగా తయారైన ఈ యుద్దనౌకను ఇవాళ భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌షిప్స్‌లో భాగంగా నేవీ చేపట్టిన ప్రాజెక్టు 28లో ఇది చిట్టచివరి యుద్ధనౌక కావడం విశేషంఈ ప్రాజెక్టులో భాగంగా తయారైన ఐఎన్‌ఎస్‌ కమోర్టా, ఐఎన్‌ఎస్‌ కాద్‌మట్‌, ఐఎన్‌ఎస్‌ కిల్తన్‌లను అభివద్ధి చేశారు. .ఇది నౌకాదళంలో కామోర్టా క్లాసుకు చెందినది.  డైరక్టరేట్‌ ఆఫ్‌ నేవల్‌ డిజైన్‌..దీన్ని డిజైన్‌ చేసింది. కోల్‌కతాకు చెందిన గార్డెన్‌ రీసర్చ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ నిర్మించారు.

Thanks! You've already liked this