సెన్సార్ అయిపోయింది.. రిలీజే త‌రువాయి

సెన్సార్ అయిపోయింది.. రిలీజే త‌రువాయి

ఈ నెల‌లో ఇప్ప‌టికే రెండు కొత్త సినిమాలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో రిలీజ‌య్యాయి. ఇపుడు సాయిధరమ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ కూడా విడుదలకు రెడీ అయిపోయింది. ఈ నెల ఆరంభంలోనే అనుష్క సినిమా నిశ్శ‌బ్దంతో పాటు రాజ్ త‌రుణ్ మూవీ ఒరేయ్ బుజ్జిగా విడుద‌ల‌య్యాయి. కొంచెం గ్యాప్ త‌ర్వాత ఈ నెల 23న ఆహాలో క‌ల‌ర్ ఫోటో విడుద‌ల కాబోతోంది. నెలాఖ‌ర్లో సూర్య ద్విభాషా చిత్రం ఆకాశం నీ హ‌ద్దురా రిలీజ‌వుతుంది.

‌దస‌రా సీజ‌న్లో వ‌స్తున్న ఈ రెండు సినిమాలు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. ఆ త‌ర్వాత న‌వంబ‌రు మ‌ధ్య‌లో దీపావ‌ళి రాబోతోంది. అప్ప‌టికి త‌మిళంలో రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. అందులో ఒక‌టి చ‌క్ర‌. విశాల్ న‌టించిన ఈ సినిమా తెలుగులోనూ విడుద‌ల కాబోతోంది. అలాగే తెలుగు నుంచి ఒక పేరున్న సినిమా ఆ టైంలో ఓటీటీల్లోకి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఆ సినిమానే.. సోలో బ్రతుకే సో బెట‌ర్. ఈ దిశ‌గా చిత్ర బృందం కూడా సంకేతాలు ఇచ్చేసింది. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ పూర్తి చేశారు. యు స‌ర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ కొత్త పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశారు. అతి త్వ‌ర‌లో విడుద‌ల అని కూడా పోస్ట‌ర్ మీద వేశారు. ఈ చిత్రాన్ని జీ5 వాళ్లు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో దీన్ని రిలీజ్ చేస్తార‌ని అంటున్నారు. అదెంత వ‌ర‌కు నిజ‌మో కానీ.. దీపావ‌ళి సీజ‌న్‌కు ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

సాయిధ‌ర‌మ్ ప‌క్క‌న న‌భా న‌టేష్ న‌టించిన ఈ సినిమాను కొత్త ద‌ర్శ‌కుడు సుబ్బు రూపొందించాడు. సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. చిత్ర‌ల‌హ‌రి, ప్ర‌తిరోజూ పండ‌గే లాంటి హిట్ల త‌ర్వాత తేజు న‌టించిన ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

Thanks! You've already liked this