ఉత్తరాఖండ్ సీఎంపై హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టు గురువారం స్టే ఇచ్చింది. జార్ఖండ్ గౌ సేవా ఆయోగ్‌కు అధిపతిగా ఓ వ్యక్తి నియమకానికి సీఎం బంధువుల బ్యాంకు ఖాతాలోకి డబ్బు బదిలీ అయినట్లు ఇద్దరు జర్నలిస్టులు ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు జరపాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సీఎంపై నమోదైన ఎఫ్ఐఆర్ను దర్యాప్తు చేయాలని సీబీఐను హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాతి రోజున సీఎం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా..సుప్రీంకోర్టు గురువారం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ స్టే ఇచ్చింది. సీబీఐ, అలాగే ఆరోపణలు చేసిన ఇద్దరు జర్నలిస్టులను నాలుగు వారాల్లో స్పందించాలని సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.