ఏనుగు-గాడిద రెండూ రెండే…!

అభివద్ధిలోనూ, ఆయుధ సంపత్తిలోనూ, సైనిక బలంలోనూ ప్రపంచంలో మరే దేశమూ తనతో పోటీ పడలేని స్థాయి అమెరికాది. తనకు తానే ప్రపంచానికి పోలీసునని ప్రకటించుకొని, సర్వాధిపతిగా ఆ దేశాధ్యక్షుడని భావిస్తోంది. ఈ పదవికి నవంబర్‌ 3వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఎంతో సంక్లిష్టమైన ఆ ఎన్నికల విధానం గూర్చి క్లుప్తంగా.. అమెరికాకు తొలి అధ్యక్షునిగా జార్జి వాషింగ్టన్‌ 1789లో ఎన్నికైన తర్వాత ఈ 230 సంవత్సరాలలో 57 సార్లు ఎన్నికలు జరిగి 48 మంది అధ్యక్షులయ్యారు. ఇంతవరకు అమెరికా చరిత్రలో రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీల అభ్యర్ధులు తప్ప మూడో పార్టీగాని, వ్యక్తిగాని ఎన్నిక కాలేదు. స్వతంత్ర అభ్యర్థి 1373 మంది ఓటర్ల సంతకాలు సేకరించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కి సమర్పించాలి. అయితే కాంగ్రెస్‌ సభ్యులుగా ఉన్నవారు పోటీ చేయదలిస్తేవారికి ఈ అవసరంలేదు. బానిస విధానాన్ని రద్దుపరచిన అబ్రహం లింకన్‌, ప్రపంచాన్ని యుద్ధ భయంతో గడగడ లాడించిన రీగన్‌, బుష్‌, ట్రంప్‌ లాంటివారూ రిపబ్లికన్స్‌లో ఉండగా ప్రపంచశాంతి, యుద్ధాల నివారణకు ఐక్యరాజ్య సమితి స్థాపనలో ప్రముఖపాత్ర వహించిన రూజ్వెల్ట్‌, ఆప్ఘన్‌, వియత్నాం దేశాల్లో మారణ హోమానికి పాల్పడిన కార్టర్‌, కెన్నడి, జాన్సను డెమోక్రాట్స్‌లో ఉన్నారు. ఇలా ఆ రెండు పార్టీల్లో ఎవరు ఎన్నికైనా సీసాల మార్పేగాని అందులోని సారాయి మారకుండా పెట్టుబడిదారి వ్యవస్థ జాగ్రత్తపడుతున్నది.
తొలుత పార్టీల్లోనే పోటీచేసే వారిమధ్య రహస్య బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ జరుగుతుంది. ఒకరిని ఎన్నుకుంటారు. దీన్ని ‘ప్రైమరీ’ అంటారు. దీనికి ప్రాథమికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. చివరకు ఆయా పార్టీల జాతీయ సదస్సులో ఎక్కువ మంది డెలిగేట్స్‌ మద్దతు పొందిన వ్యక్తిని పార్టీ అభ్యర్థిగా నామినేట్‌ చేస్తారు. అమెరికాలో 50 రాష్ట్రాలున్నాయి. రిపబ్లికన్‌ పార్టీ 2206 మంది డెలిగేట్స్‌తోనూ, డెమోక్రటిక్‌ పార్టీ 4284 మంది డెలిగేట్స్‌తోనూ జాతీయ సదస్సులు జరుపుతాయి. ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా డెలిగేట్స్‌ని నిర్ణయిస్తారు (ఉదాహరణ – అతి ఎక్కువ జన సంఖ్య ఉన్న కాలిఫోర్నియాలో డెమోక్రట్లకి 383 మంది డెలిగేట్స్‌ ఉండగా రిపబ్లికన్స్‌కి 210 మంది ఉన్నారు). ఉపాధ్యక్ష పదవికి సాధారణంగా అభ్యర్థి ఎంపికను అధ్యక్ష అభ్యర్థికేవదుల్తారు. ఆయన ఎంపికచేసిన వ్యక్తినే పార్టీ జాతీయ సదస్సు ఆమోదిస్తుంది.
ఈ ఘట్టం తర్వాత నవంబర్‌ మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం అసలు ఎన్నికలు జరుగుతాయి. ఈ సారి మొదటి సోమవారం 2వతేదీ వచ్చింది కనుక నవంబర్‌3న ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంతవరకూ ఆ క్రమం తప్పలేదు. ఒకసారి బుష్‌ ఎన్నికల వాయిదాకు ప్రయత్నించినా కాంగ్రెస్‌, సెనెట్‌ అంగీకరించలేదు.
ఇంత జరిగినా ప్రజలు ప్రత్యక్షంగా అధ్యక్షుణ్ణి ఎన్నుకోరు. ప్రతి రాష్ట్రానికి జనాభా ప్రాతిపదికన ప్రజా ప్రతినిధుల సభకి సభ్యులు ఎన్నుకోబడతారు…వారు 438 మంది. అలాగే ప్రతి రాష్ట్రానికి ఇద్దరు సెనేటర్లు ఉంటారు (50 శ 2 ొ 100) అలా మొత్తం 538 మందితో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీతో సగానికి పైగా (270) మద్దతు పొందిన అభ్యర్థి అధ్యక్షుడవుతారు. కాంగ్రెస్‌సభ్యులు, సెనేటర్లు తమను ఎన్నుకొన్న ప్రజాబి óప్రాయం ప్రకారంకాకుండా తమ వ్యక్తిగతఇష్టాలతోనే రహస్యబ్యాలెట్‌ ద్వారా ఓటేేస్తారు. కనుక అది సరైన ప్రజాభిప్రాయం కాదు. 2000లో జార్జి బుష్‌ 5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయినా ఎలక్టోరల్‌ కాలేజీలో 271 ఓట్లు రావటంతో ఎన్నికయ్యాడు. ఆల్‌గోరే 5 లక్షల మెజారిటీ పాపులర్‌ఓట్లు సాధించినా ఎలక్టోరల్‌ కాలేజీలో 266 ఓట్లు రావటంతో ఇంటిముఖం పట్టాడు.1991లో సీనియర్‌ బుష్‌ లోపభూయిష్టమైన ఎలక్ట్రానిక్‌ యంత్రాల కారణంగా గెలిచాడు. ఫ్లోరిడా గవర్నర్‌గా బుష్‌ సోదరుడు జేట్‌ బుష్‌. నల్ల జాతీయుల ఓట్లను జాబితా నుండి తొలగించి అక్రమాలకు పాల్పడ్డాడు. ఆ ఎన్నికల్లో బుష్‌కి 254, కెర్రీకి 252 ఓట్లు వచ్చాయి. ఇదే రకమైన అక్రమాలకి ట్రంప్‌ 2016లో పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈసారి జరగబోయే అధ్యక్ష ఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. రిపబ్లికన్‌ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ పార్టీ తరపున జోబిడెన్‌ పోటీ చేస్తుండగా ఉపాధ్యక్ష పదవికి రెండు పార్టీల తరపున నిక్కీ హేలి (రిపబ్లికన్‌) కమలా హారిస్‌ (డెమోక్రటిక్‌) ఇద్దరూ మహిళలు కావటమే గా భారత సంతతికి చెందినవారు కావటం విశేషం.
కొవిడ్‌ బారినపడి 2లక్షలకు పైగా మరణించారు. 2020 మార్చి నాటికి సుమారు 9 లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు. కార్మికవర్గంలో 3వ వంతు పనికోల్పోయారు. నల్లజాతి వాళ్ళపై శ్వేతజాతీయుల దాడులుపెరిగాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ గెలవటానికి ట్రంప్‌ ఎదురీదుతున్నారు. అన్నట్లు రిపబ్లికన్‌ పార్టీ ఎన్నికల గుర్తు ‘ఏనుగు’. డెమోక్రటిక్‌పార్టీ గుర్తు ‘గాడిద’. ఆ రెండూ సాధుజంతువులే. కాకుంటే ఆ పార్టీలదీ ఒక్కటే విధానం. ప్రపంచ పెత్తనమే!

Thanks! You've already liked this