ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సుప్రీం కర్తవ్యం

భారతదేశం న్యాయవ్యవస్థ అత్యంత శక్తివంతమైంది. అయితే ఇటీవల కాలంలో న్యాయవ్యవస్థ ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రశ్నించడానికి తన శక్తిని వినియోగించడం లేదు. దేశంలో కోర్టులు ప్రజల హక్కుల పరిరక్షణకు, సామాజిక న్యాయం కల్పించేందుకు పనిచేయడంలేదు, కార్యనిర్వాహక వర్గంతో ముడివేసుకుని పనిచేస్తున్నాయి. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ పనిచేస్తోందని భావించవలసి వస్తోంది. 1788లో న్యాయ కోవిదుడు మాంటెస్క్స్‌ కీలకమైన ప్రశ్న లేవనెత్తారు. న్యాయవ్యవస్థ… స్వేచ్ఛకు ముప్పు కలిగిస్తుందా? అని ప్రశ్నించారు. ‘కార్యనిర్వాహక వర్గం, చట్టసభల అధికారాల నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేయకపోతే స్వేచ్ఛ అనేది ఉండదు’ అని ఆయన పేర్కొన్నారు. అమలు ద్వారా కార్యనిర్వాహక వర్గాన్ని, సంకల్ప లక్ష్యం ద్వారా చట్టవ్యవస్థను, తీర్పుద్వారా న్యాయ వ్యవస్థను నిర్వచిస్తారు. ఇటీవల వెలువడు తున్న తీర్పులు అనేక అంశాలలో కోర్టును తప్పు పట్టేవిగా ఉన్నాయి. జాన్‌రాల్స్‌ అనే న్యాయ నిపుణుడు ‘పొలిటికల్‌ లిబరలిజం’ పుస్తకాన్ని రచించారు. రాజ్యాంగ కోర్టుల లక్షణాలను నిర్వచించడానికి ప్రజాభిప్రాయం ఒక అంశమని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మనదేశంలో సుప్రీంకోర్టులు ఎంతమాత్రం రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయడం లేదు. అమెరికా న్యాయ వ్యవస్థపై తరచుగా వచ్చే విమర్శల పద్ధతులు భారత న్యాయ వ్యవస్థకు, ప్రపంచంలోని ఇతర న్యాయ వ్యవస్థలకు వర్తించవు. అమెరికా న్యాయ వ్యవస్థ భావజాలానికి భారత న్యాయవ్యవస్థ పూర్తిగా భిన్నమైంది. ప్రత్యేకించి దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత పూర్తి భిన్నంగా ఉంది.
1. సరళమార్పు : మాంటెస్క్స్‌ ప్రకారం రాజ్యాంగం అందరికీ సమంగా, చక్కగా అమలుకావడమే లక్ష్యం. భారత రాజ్యాంగంలో పేర్కొనదగింది న్యాయ సమీక్ష. రాజకీయ నిర్ణయాలకు పై స్థానంలో రాజ్యాంగంఉంటుంది, రాజ్యాంగంలో తీసుకువచ్చిన ప్రధాన మార్పు ఇది. విక్రమ్‌సేథ్‌ రచన ‘ఎ స్యూటబుల్‌ బారు’ పుస్తకంలో, వ్యాజ్యాలు, రిట్‌లలోనూ మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రభుత్వ జవాబుదారీతనం న్యాయం వ్యవస్థ సమీక్ష వల్లే సాధ్యమైంది.
2. ప్రజాస్వామిక మార్పు : భారతదేశంలో వారసత్వంగా వస్తున్న కులం, స్త్రీ, పురుషభేదం, వర్గాలకు సార్వత్రిక ఓటు హక్కును కల్పించడానికి చట్టం అమలు చేశారు. దీనిపైన డా|| అంబేద్కర్‌ ఇలా చెప్పారు. ‘భారతదేశంలో రాజకీయ సమత్వమేకాదు, సామాజిక, ఆర్థిక సమత్వం’ అమలుకానుందని చెప్పారు. అయితే భారతదేశ సామాజిక వ్యవస్థలోకి రాజకీయ సమత్వం ప్రవేశించింది.
3. సుస్థిరతకు మార్పు : భారతదేశ రాజ్యాంగం పూర్తిగా స్థిరమైంది. ఆదేశిక సూత్రాలు పేదరికాన్ని నిర్మూలించే క్రియాశీలమైన ఆధునిక రాజ్యాన్ని ప్రమోట్‌ చేస్తాయి. అలాంటి రాజ్యంలో నాగరిక సమాజం ఉంటుంది. అదే సరళీకృత ప్రజాస్వామ్యానికి కూడా సరిపడుతుంది. రాజ్యాంగ అసెంబ్లీ సమావేశాలలో సామాజికసంస్కరణలు, మార్పులకు సంబంధించినఅంశాలు చర్చకు వచ్చాయి.
విస్తరించిన న్యాయ సమీక్షకు, ప్రాథమిక హక్కులకు ప్రభుత్వ పరిధిలో ఉండే ఆదేశిక సూత్రాలకు మధ్య ఘర్షణ ఉంటుంది. ఈ ఘర్షణ ఆదేశిక సూత్రాలకు సంబంధించింది మాత్రమేకాదు బలమైన కేంద్రం, బలహీనమైన ఫెడరల్‌ వ్యవస్థకు సంబంధించింది కూడా. రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు లేకపోతే ఏం జరుగుతుంది? అని వీటిపై అధ్యయనంలో హెచ్‌ఎం సీర్వారు తీవ్రమైన ప్రశ్న లేవనెత్తారు. ఏమీ జరగదు అనికూడా ఆయన సమాధానం చెప్పారు. ఒకవేళ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు లేకపోతే ఏం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. దీనికికూడా ఆయనే సమాధానం చెపుతూ పరిణామాలు విపత్తును సృష్టిస్తాయన్నారు. ప్రథమ ప్రధాని నెహ్రూ ప్రకారం ప్రాథమిక హక్కులు, న్యాయ వ్యవస్థ స్థిరమైంది. అదే సమయంలో భారత రాజ్యాంగం శక్తివంతమైంది. రాజ్యాంగ న్యాయ బహుళత్వాన్ని మనం బోధించవలసి ఉంటుంది. కొన్ని ఇతర చట్టాలు ఉంటాయి. ఇవి రాజ్యాంగానికి భిన్నమైనవి. రాజ్యం పరిధిలో ఉండే ఆదేశిక సూత్రాలు సామాజిక మార్పునకు తగిన శక్తి కలిగి ఉంటాయి. ప్రాథమిక హక్కులపై ఆంక్షలు ఉండవు. కొంతకాలం వీటిమధ్య పోరాటం కొనసాగింది. 1970లో గోలక్‌నాధ్‌ కేసు తీర్పు సందర్భంగా రాజ్యాంగంకంటే ప్రాథమిక హక్కులు ప్రధానమైనవని కోర్టు స్పష్టం చేసింది. అప్పుడు దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఇది గొప్ప రాజ్యాంగ యుద్ధమే అని గ్రాన్‌విల్లే ఆస్టిన్‌ వ్యాఖ్యానించారు. 1970లలో ఆదేశిక సూత్రాలకు ఉన్నతస్థానం కలిగింది. 1971లో జరిగిన ఎన్నికలలో సుప్రీంకోర్టు సామాజిక సంస్కరణలను రద్దు చేసింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నించినప్పటికి కోర్టు తీసుకున్న చర్య వల్ల ఆమె రాజ్యాంగానికి కట్టుబడి ఉండిపోయారు. 1971, 1977లలో రాజ్యాంగంలో 19 సవరణలను తీసుకురావటం ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం చివరకు విజయం పొందింది. రాజ్యాంగ సవరణలలో అతి ముఖ్య మైంది 25వ సవరణ. దీనిద్వారా ప్రాథమిక హక్కులకంటే సోషలిస్టు ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యత కల్పించారు. ఆ కాలంలో అంకితభావంతో పనిచేసిన న్యాయ వ్యవస్థ వీటిపైన తీవ్రంగా చర్చించింది. 1970లలో రాజ్యాంగ లక్ష్యాలను ఉటంకిస్తూ రాజ్యాంగ మూల రచననే నిర్వీర్యం చేశారు. మరో మాటలో చెప్పాలంటే రాజ్యాంగం మూల రచన రాజ్యాంగ లక్ష్యాలకు అడ్డంకిగా ఉందని భావించారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పూర్తిగా తీవ్రమైన స్థితికి వెళ్ళారు. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 31సిని ప్రవేశపెట్టడం ద్వారా న్యాయ సమీక్షను పూర్తిగా నిర్వీర్యం చేశారు. 1980లో మినర్వా మిల్స్‌ కేసులో కోర్టు 31సి సవరణను రద్దుచేసి ఆదేశిక సూత్రాలు న్యాయ సమీక్షకంటే పై స్థాయిలో ఉంటాయని తీర్పుచెప్పింది. మినర్వా మిల్స్‌ కేసు తీర్పులో న్యాయమూర్తి పి.ఎన్‌. భగవతి భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా అత్యంత తీవ్రంగా అసమ్మతిని వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని అర్ధం చేసుకునేందుకు నూతన విజ్ఞతను ప్రవేశ పెట్టారు. న్యాయమూర్తి భగవతి ఇలా చెప్పారు. విలువైన జీవనాన్ని గడిపేందుకు ప్రాథమిక హక్కులు అత్యంత విలువ కలిగినవి అయినప్పటికి అవి పేదలకు, అణగారిన వర్గాలకు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఎంత మాత్రం ప్రయోజనం కలిగించలేదు, దేశంలో వీరి సంఖ్యే ఎక్కువగా ఉందని న్యాయమూర్తి భగవతి చెప్పారు. ఇలాంటి అభిప్రాయాన్నే ఆధార్‌పై వెలు వరించిన తీర్పు సందర్భంగా అటార్నీ జనరల్‌ మాట్లాడుతూ గోప్యత హక్కు ఉత్తమమైనదని అన్నారు.
ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కుల వివరణల ద్వారా సామాజిక న్యాయాన్ని కల్పించే విషయంపై కోర్టు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలి. ఉదారమైన వివరణలు మినహా అన్ని విధాలైన వివరణలను ఆర్టికల్‌ 21 ఇచ్చింది. మార్పు చెందిన రాజ్యాంగం న్యాయ వ్యవస్థలో భిన్నమైన పద్ధతిని అవలంబించింది. ఫలితంగా కార్యనిర్వాహక వర్గానికి, న్యాయ వ్యవస్థకు ఏర్పడిన సన్నిహితం ఎంతోకాలం మంత్రం వలె కొనసాగదు. అయితే దేశంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధి లక్ష్యాల సాధన జరగాలి. పరిస్థితులు ఇప్పటివలె కొనసాగితే పౌర స్వేచ్ఛలను న్యాయ వ్యవస్థ రక్షించజాలదు. మార్పు చెందిన రాజ్యాంగంపై మరింత సమ్మతి కలుగుతోంది. ప్రభుత్వానికి ఉదారమైన ప్రజా స్వామిక మార్పు ముఖ్యమైంది. రాజ్యం న్యాయ వ్యవస్థతో కలిసి పనిచేస్తూ అవలంబిస్తున్న నియంతృత్వ ధోరణులను నిలువరించాలి.

Thanks! You've already liked this