2 నుంచి స్కూళ్లు, కాలేజీలు

తొలుత 9,10, హయ్యర్‌
స్టడీ క్లాసులు
బ 23 నుంచి 6,7,8 తరగతులకు…
బ డిసెంబరు 14నుంచి అన్నీ
బ షెడ్యూలు విడుదల చేసిన సీఎస్‌ సాహ్నీ

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి :
కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్రంలో మూతపడ్డ విద్యాసంస్థలు నవంబరు 2 నుంచి దశలవారీగా తిరిగి తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. నవంబరు 2 నుంచి 9,10, తరగతులతోపాటు ఇంటర్‌మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర తరగతులు ప్రారంభిస్తారు. వీరందరికీ రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తారు. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అన్ని కాలేజీలకూ నవంబరు 2నుంచే తరగతులు ప్రారంభమవుతాయి. వీరికి కూడా రొటేషన్‌ పద్ధతిలోనే తరగతులుంటాయి. నవంబరు 23 నుంచి 6,7,8 క్లాసులకు బోధన ప్రారంభమవుతుంది. డిసెంబరు 14 నుంచి 1,2,3,4,5 తరగతులు ప్రారంభిస్తారు. అందరికీ కొంతకాలం హాఫ్‌ డే క్లాసులు నిర్వహిస్తారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్‌ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలన్నింటికీ ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుందని సీఎస్‌ తెలిపారు.

Thanks! You've already liked this