ఇప్పటి వరకు చూడని పాత్రలో అల్లరి నరేష్

నాంది’ అనే వైవిధ్యమైన సినిమా ద్వారా హీరో అల్లరి నరేష్ ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మేరకు చిత్ర యూనిట్ షూటింగ్ ముగిసినట్టు తెలియజేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో అల్లరి నరేష్ కిటికీ దగ్గర నిలబడి తన బాధను అరుస్తూ లోకానికి చెబుతున్నట్టు ఉంది.

కాగా, ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ప్రకటించినప్పుడే టైటిల్‌తో అందరినీ ఆకట్టుకుంది. దీనికి తోడు ఫస్ట్ లుక్ పోస్టర్ విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేసింది. పాత్ర కోసం అల్లరి నరేష్ నగ్నంగా నటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు. సిధ్ సినిమాటోగ్రఫీ అందించారు. అల్లరి నరేష్‌తో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, నవమి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి, దేవి ప్రసాద్, వినయ్ వర్మ, సీఎల్ నరసింహారావు, శ్రీకాంత్ అయ్యంగర్, రమేష్ రెడ్డి, చక్రపాణి, రాజ్యలక్ష్మి, మణి చందన, ప్రమోదిని తదితరులు నటించారు.

The post ఇప్పటి వరకు చూడని పాత్రలో అల్లరి నరేష్ appeared first on Telugu Bullet.

Thanks! You've already liked this