తాగిన మైకంలో కొడుకుని చంపిన కసాయి తండ్రి

కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాగిన మైకంలో తనయుడిని నరికి చంపాడో కసాయి తండ్రి. గొడ్డలితో నరకడంతో కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పెడన మండలం ఉప్పలకలవగుంటలో జరిగింది. గ్రామానికి చెందిన భూపతి వెంకటేశ్వరరావు మద్యం తాగి ఇంటికొచ్చి కొడుకు ఏడుకొండలుతో గొడవకు దిగారు.

ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో మద్యం మత్తులో ఉన్న తండ్రి దారుణానికి తెగబడ్డాడు. ఆగ్రహంతో ఊగిపోతూ గొడ్డలి తీసుకుని కొడుకుని నరికేశాడు. ఈ దాడిలో కొడుకు ఏడుకొండలుకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

The post తాగిన మైకంలో కొడుకుని చంపిన కసాయి తండ్రి appeared first on Telugu Bullet.

Thanks! You've already liked this