పెళ్లి పీటలెక్కుతున్న బిగ్ బాస్ నటి?

బిగ్ బాస్ 3

గత సీజన్ లో విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చెట్టాపట్టాలేసుకుని హౌస్ లో అల్ల్లరి చేసిన పునర్నవి భూపాలం.. తర్వాత సినిమా అవకాశాలు, హాట్ హాట్ ఫొటోస్ షూట్స్ తో బాగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ కి వెళ్ళకముందు సినిమాల్లో నటించిన పునర్నవికి బిగ్ బాస్ సీజన్ 3 మంచి పేరు తెచ్చింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో క్లోజ్ గా ఉండడం చూసి వాళ్ళు వాళ్లిద్దరూ లవ్ ఉన్నారని అనుకున్నారు. బిగ్ బాస్ నుండి వచ్చాక పెళ్లి కూడా  చేసుకుంటారనే ప్రచారం జరిగింది. అయితే పునర్నవి కానీ, రాహుల్ కానీ ఎక్కడా తాము ప్రేమలో ఉన్నట్లుగా బయటపెట్టలేదు. సో సీక్రెట్ లవర్స్ అంటూ అందరూ ఫిక్స్ అయ్యారు.

ఇక రాహుల్ సింగర్ గా కెరీర్ లో బాగా బిజీ అవగా.. తాజాగా పునర్నవి పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా సోషల్ మీడియా, వెబ్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ట్విట్టర్ లో పునర్నవి తన చేతికి నిశ్చితార్ధపు ఉంగరాన్ని చూపిస్తూ ఫోటోకి ఫోజివ్వడమే కాదు.. రేపు 30 వ తారీఖున ఓ ముచ్చట చెప్పబోతున్నట్టుగా చెప్పి అందరికి షాకిచ్చింది. మరి పునర్నవి పెళ్లి చేసుకోబోయేది రాహుల్ నా లేక మారేవారన్నానా అనేది ప్రస్తుతం ఉన్న సస్పెన్స్. గతంలో రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి లైఫ్ లో మరొకరున్నారని చెప్పినా పునర్నవి – రాహుల్ విషయంలో న్యూస్ మాత్రం ఆగలేదు. సో ఇప్పుడు పునర్నవి తనకి కాబోయే వరుడిని పరిచయం చేసే వరకు అందరిలో లో ఒకటే టెంక్షన్.

The post పెళ్లి పీటలెక్కుతున్న బిగ్ బాస్ నటి? appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this