పవన్‌ కల్యాణ్‌ తో ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వరుసగా సినిమాలను చేస్తున్నారు. ఇప్పటికే తను నటిస్తున్న ‘వకీల్‌ సాబ్‌’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉండగా.. ఈ సినిమా పూర్తి కాకుండానే పవన్ దర్శకులు క్రిష్,‌ సురేందర్ రెడ్డి, హరీశ్‌ శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేగాక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై పవన్‌ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు విజయదశమి రోజు అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాకు సాగర్‌ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో సూపర్‌ హిట్‌ సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోశియనుమ్‌’కు చిత్రానికి ఇది రీమేక్‌. దీనికి ‘బిల్లా రంగా’ టైటిల్ ప్రచారంలో ఉంది. పిల్లలకు మెహందీ పెడుతున్న హీరోయిన్‌

మాలయాళంలో బిజు మీనన్‌ నటించిన పోలీస్ పాత్రలో వన్ కళ్యాణ్ నటించనున్నారు. పృథ్వీరాజ్‌​ పాత్రలో నితిన్‌ను తీసుకోనున్నట్లు కొన్ని వార్తులు వెలువడ్డాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పవన్‌కు జోడీగా నటి సాయి పల్లవి నటించనుందనే వార్త ప్రచారంలో ఉంది.

తన సహజసిద్ధమైన నటనతో దక్షిణాదిన మంచి నటింగా గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్‌తేజ్‌తో నటించిన ‘ఫిదా’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె పవర్‌స్టార్‌తో నటించే బంపర్‌ ఆఫర్‌ కొట్టేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా చిత్ర యూనిట్ అధికారిక సమాచారం రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో రానాతో విరాటపర్వం, నాగచైతన్యతో లవ్‌స్టోరీ చిత్రాల్లో నటిస్తున్నారు.

The post పవన్‌ కల్యాణ్‌ తో ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్ appeared first on Telugu Bullet.

Thanks! You've already liked this