వకీల్ సాబ్ డీల్ క్లోజా?

Pawan Kalyan in Vakeel Saab

పవన్ కళ్యాణ్ గెటప్ మార్చి వకీల్ సాబ్ షూటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. వకీల్ సాబ్ షూట్ పవన్ స్టార్ట్ అయిన 20 రోజుల్లో పూర్తి చెయ్యాలని చూస్తున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. వకీల్ సాబ్ షూటింగ్ ఎప్పుడవుతుందా? సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? అని పవన్ ఫాన్స్ ఎదురు చూపులకి కరోనా అడ్డం పడుతూనే ఉంది. అయితే వకీల్ సాబ్ కోసం చాలా ఓటిటి సంస్థలు నిర్మాత దిల్ రాజు వెంట పడ్డాయి. అలాగే భారీ ఆఫర్స్ కూడా వకీల్ సాబ్ కోసం దిల్ రాజు ముందు ఉంచాయి. కానీ పవన్ బొమ్మ పడితే థియేటర్ లోనే అంటూ దిల్ రాజు భీష్మించుకుని కూర్చున్నాడు.

మరి వకీల్ సాబ్ షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ అయ్యాక ఈ సినిమా థియేటర్స్ లో విడుదలవుతుంది అది దిల్ రాజు ప్లాన్. అయితే తాజాగా వకీల్ సాబ్ డీల్ ఒకటి క్లోజ్ అయినట్లుగా టాక్. అది కూడా శాటిలైట్, డిజిటల్ హక్కుల డీల్ ని దిల్ రాజు భారీ ధరకు క్లోజ్ చేసినట్లుగా చెబుతున్నారు. ప్రముఖ ఛానల్ జెమిని టీవీ వకీల్ సాబ్ డిజిటల్, శాటిలైట్ హక్కులను భారీ ధరకు ఎగరేసుకుపోయింది అని.. ఫిలింనగర్ న్యూస్. మరి వకీల్ సాబ్ డీల్ ఎంతకీ కాజ్ అయ్యిందో క్లారిటీ లేదు అని.. భారీ ధర అని మాత్రం ప్రచారం జరుగుతుంది. ఏదైనా పవన్ స్టామినా ముందు ఏ డీల్ అయినా చిన్నదిగానే కనబడుతుంది.

The post వకీల్ సాబ్ డీల్ క్లోజా? appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this