ఉండవల్లి ఇచ్చిన మోటివేషన్ క్లాస్ తో జగన్ వీరోచితంగా పోరాడతారా?

Vundavalli Aruna Kumar - YS Jaganపోలవరం నిధుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం రాజుకున్న విషయం విదితమే. పోలవరం అంచనా విలువ రూ.20398.61 కోట్లే అని, తమకు ప్రాజెక్టు లో అతిపెద్ద ఖర్చయిన భూసేకరణ, పునరావాసంతో సంబంధం లేదని కేంద్రం మాట మార్చింది. ఇదే ప్రధాన అజెండాగా నవంబరు రెండో తేదీన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అత్యవసర సమావేశం జరగనుంది.

ఈలోపు… మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ముందుకు వచ్చి జగన్ సర్కార్ పై ప్రశ్నలు సంధించారు. పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం మాట మారుస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కౌంటర్‌ దాఖలు చేయడం లేదు?. ఇంత జరుగుతున్నా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ నోరెత్తలేదేం..? అని అడిగారు.

అయితే ఈ సందర్భంలో కూడా జగన్ ని తెలివిగా వెనకేసుకొని వచ్చారు ఉండవల్లి. “జగన్‌ను మోదీ జైలులో పెడితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. జగన్‌ను జైలులో వేయటం అంత సులువా?,” అని చెప్పుకొచ్చారు. అసలు జగన్ మీద పెట్టిన కేసులలో విషయమే లేదని…. అందులో జగన్ కి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా మాట్లాడారు ఉండవల్లి.

జగన్ ని తప్పు చేస్తున్నట్టుగా కాకుండా.. నీ బలం నీకు తెలీదు వెళ్లి పోరాడు అన్నట్టు ఉండవల్లి మాట్లాడారు. “పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజశేఖరరెడ్డి కొడుకు కాంప్రమైజ్ అయితే ఈ ప్రభుత్వం ఎందుకు?,” అంటూ ఎలేవేషన్ ఇచ్చారు. ఉండవల్లి ఇచ్చిన మోటివేషన్ క్లాస్ తో జగన్ వీరోచితంగా పోరాడతారా అనేది చూడాలి.

The post ఉండవల్లి ఇచ్చిన మోటివేషన్ క్లాస్ తో జగన్ వీరోచితంగా పోరాడతారా? appeared first on mirchi9.com.

Thanks! You've already liked this