80 శాతం పిల్లలు బడులకు దూరమే

80 శాతం పిల్లలు బడులకు దూరమే

ప్రభుత్వం స్కూళ్ళను తెరిచినా చాలామంది విద్యార్ధులు దూరంగానే ఉంటున్నారు. పాఠశాల విద్యాశాఖ తాజాగా  నిర్వహించిన ఓ సర్వేలో  80 శాతం మంది విద్యార్ధులు స్కూళ్ళకు దూరంగానే ఉంటున్నట్లు అర్ధమైపోయింది. ప్రభుత్వం ఈమధ్యనే  9,10 తరగతుల విద్యార్ధుల కోసం స్కూళ్ళను తెరిచింది. హాజరయ్యే విద్యార్ధులకు, పాఠాలు చెప్పాల్సిన టీచర్లకు కూడా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.  తరగతి గదిలోని మొత్తం విద్యార్ధుల్లో సగం మంది మాత్రమే హాజరవ్వాలన్నది ముఖ్యమైనది.

ఉదాహరణకు ఓ తరగతిలో 50 మంది విద్యార్ధులుంటే అందులో సగంమంది ఓ రోజు మిగిలిన సగంమంది మరుసటి రోజు స్కూలుకు హాజరవ్వాలని స్పష్టంగా చెప్పింది. ప్రతి విద్యార్ధికి స్కూలు ఎంట్రన్స్ లోనే  కరోనా వైరస్ స్క్రీనింగ్ టెస్టులు చేయాలని కూడా ప్రభుత్వం స్కూళ్ళ హెడ్ మాస్టర్లకు ఆదేశాలిచ్చింది. సరే ఆచరణలో ఎంతవరకు అమల్లోకి అవుతోందన్నది వేరే సంగతి.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  ప్రభుత్వం స్కూళ్ళను తెరవగానే హాజరైన విద్యార్ధుల్లో వందలాది మంది టీచర్లు, విద్యార్ధులకు కరోనా వైరస్ ఉన్న విషయం బయటపడింది. దాంతో చాలామంది తల్లి దండ్రులు తమ పిల్లలను స్కూళ్ళకు పంపటానికి ఇష్టపడలేదు. 9, 10 తరగతుల్లో చదువుతున్న విద్యర్ధుల తల్లి, దండ్రులు కూడా తమ పిల్లలను స్కూళ్ళకు పంపేది లేదని ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పేశారట. ఇందుకు మూడు కారణాలున్నాయట.

మొదటిది కరోనా వైరస్ తీవ్రత. రెండోది స్కూళ్ళల్లో హాస్టళ్ళు తెరవకపోవటం, మూడోది తమ ఊర్లనుండి స్కూళ్ళున్న ఊర్లకు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవటం. పిల్లలందరు ఒకచోట గుమిగూడితే వారిలో ఎవరికి కరోనా వైరస్ ఉందో ఎవరికి లేదో ఎవరికీ తెలీదు. ఒకరికుంటే మిగిలిన వాళ్ళకు వచ్చేస్తుందన్న భయంతోనే తల్లి, దండ్రులు తమ పిల్లలను స్కూళ్ళకు పంపటానికి ఇష్టపడటం లేదని సర్వేలో తేలింది. విద్యార్ధులు స్కూళ్ళకు రాకపోవటంపై పాఠశాల విద్యాశాఖ 71 వేలమంది విద్యార్ధుల తల్లి, దండ్రులతో సర్వే చేసిందట. 9, 10 తరగతుల విద్యార్ధులే స్కూళ్ళకు రావటం లేదంటే ఈనెల 23వ తేదీ నుండి 6,7,8 తరగతులను కూడా ప్రభుత్వం ప్రారంభిస్తోంది.

ఎక్కువమంది తల్లి, దండ్రులు కరోనా వైరస్ సమస్యనే ప్రస్తావించారట. ఇదే సమయంలో మిగిలిన  రెండు సమస్యలను కూడా ప్రస్తావించినట్లు అర్ధమవుతోంది. ఏదేమైనా స్కూళ్ళు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం పెద్దగా సత్ఫలితాలు ఇచ్చిందనే విషయంలో మిశ్రమ స్పందన కనబడుతోదంతే. హాజరుకాని విద్యార్ధుల తల్లి, దండ్రులు తమ పిల్లలకు ఆన్ లైన్ బోధన జరపాలని కోరుకుంటున్నారు. మరి కరోనా వైరస్ సమస్య ఎప్పుడో పోతుందో  విద్యార్ధులు, తల్లి, దండ్రుల హాజరు ఎప్పుడు పెరుగుతుందో ఏమో.

Thanks! You've already liked this