హల్‌చల్‌ చేసిన మహిళ

దేశ రాజధానిలో బుర్ఖా ధరించి చేతిలో తుపాకీ పట్టుకుని ఓ షాపు యజమానిని బండ బూతులు తిడుతూ.. గాల్లోకి కాల్పులు జరిపి ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. ఇక సదరు యువతిని జఫ్రబాద్‌కు చెందిన నుస్రత్‌గా గుర్తించారు.

ఇక ఈ సంఘటన ఈశాన్య ఢిల్లీలోని చౌహాన్‌ బంగ్రా ప్రాంతంలో ఈ నెల 18న చోటు చేసుకుంది. నుస్రత్‌కి, ఓ షాపు యజమానికి మధ్య మొబైల్‌ ఫోన్‌కు సంబంధించి వివాదం తలెత్తింది. అప్పటికే మద్యం సేవించి ఉన్న నుస్రత్‌ షాపు యజమానిని అసభ్యకరంగా తిడుతూ.. గన్‌తో బెదిరించడమే కాక అతని షాపు బయట కాల్పులు కూడా జరిపింది.

అంతేకాక తాను గ్యాంగ్‌స్టర్‌ నసీర్‌ సోదరినని తెలిపింది. మహిళ చర్యలతో అక్కడ ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఈ వీడియో ఇండియాటుడేలో ప్రసారం అయ్యింది.

The post హల్‌చల్‌ చేసిన మహిళ appeared first on Telugu Bullet.

Thanks! You've already liked this