ఎన్నికల కోడ్‌ను పాటించాల్సిందే

పలు పార్టీలు ఎన్నికల సంఘం జారీ చేసిన కోవిడ్‌ నిబంధనలు పాటించడం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించరాదని ఎన్నికల కమిషన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పాటించాలని సూచిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇంటింటి ప్రచారం, రోడ్‌షోలు, ర్యాలీలు తదితర ప్రచార కార్యక్రమాల్లో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం సందర్భంగా తప్పని సరిగా ముఖానికి మాస్క్‌ ధరించాలి. అలాగే శానిటైజర్లను వినియోగిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించింది.. ఇంటింటి ప్రచారానికి వెళ్లినప్పుడు అభ్యర్ధితో పాటు ఐదుగురు మాత్రమే వెళ్లాలని పేర్కొంది.

Thanks! You've already liked this