తుఫాన్‌ దృష్ట్యా పలు రైళ్ల రద్దు

నివర్‌ తుఫాన్‌ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నడిచే ఏడు రైళ్లు నిలిపివేసినట్లు ప్రకటించింది. మరో 8 సర్వీసులను దారి మళ్లించింది. హైదరాబాద్‌-తాంబరం, మధురై-బికనూరు, చెన్నై సెంట్రల్‌-సంత్రగచి మధ్య రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. చెన్నై, తిరుపతి, రేణిగుంట, పాకాల వైపు నడిచే మరిన్ని రైలు సర్వీసులకు అంతరాయం కలగవచ్చని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

Thanks! You've already liked this