మారడోనా ‘అత్యంత ఉన్నతుడు’ : అర్జెంటైనా అధ్యక్షుడు

బ్యూనస్‌ ఎయిర్స్‌ : ప్రముఖ ఫుట్‌బాల్‌ ఆటగాడు డీగోఅర్మాండో మారడోనా ‘అందరిలో గొప్పవాడు” గా అర్జెంటైనా అధ్యక్షుడుఅల్బెర్టో ఫెర్నాండజ్‌ కీర్తించారు. డీగో మారడోనా బుధవారం మరణించడంతో బ్యూనస్‌ ఎయిర్స్‌ స్థానిక స్పోర్ట్స్‌ ఛానెల్‌ టైక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అధ్యక్షుడు మాట్లాడుతూ…మారడోనా అర్జెంటైనాను ప్రపంచంలో నూతన శిఖరాలకు తీసుకెళ్లారని శ్లాఘించారు. మమల్ని అత్యంత ఆనందోత్సవాలతో పలు సందర్భాల్లో సంతోషపరచారు. మేము మిమ్నల్ని ఎప్పటికీ కోల్పోము అని పేర్కొన్నారు. మారడోనా గొప్ప ఆదర్శనీయమైన వ్యక్తిగా కొనియాడారు. ఫెర్నాండజ్‌ అర్జెంటీనాస్‌ జూనియర్స్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ అభిమాని. దీనిలోనే మారడోనా 1976లో ప్రొఫెషనల్‌ సాకర్‌ ఆటగాడిగా అరంగ్రేట్‌ చేశారు. 1980 వరకు ఆయన ఆడారు.

Thanks! You've already liked this