యుఎఇతో వ్యూహాత్మక సహకారం

అబుదాబి : గల్ఫ్‌ రాజ్య పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, అబుదాబి యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తో చర్చలు జరిపారు. కోవిడ్‌ అనంతర కాలంలో భారత్‌-యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ) మధ్య వ్యూహాత్మక సహకారంపై ఇద్దరు నేతలు చర్చించారు. ముఖ్యమైన ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. జైశంకర్‌ బుధవారం రాత్రి ఇక్కడకు వచ్చారు. ”అబుదాబిలో నన్ను స్వాగతించిన బిన్‌ జాయెద్‌కు కృతజ్ఞతలు.. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరఫున శుభాకాంక్షలు తెలిపాను.. కోవిడ్‌ నేపథ్యంలో యుఎఇలో పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయుల బాగోగులపై శ్రద్ధాసక్తులు చూపినందుకు అభినందించాను.” అని జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. కోవిడ్‌ అనంతర యుగంలో మా వ్యూహాత్మక సహకారాన్ని అభివద్ధి చేయడం గురించి చర్చించినట్లు చెప్పారు. యుఎఇలో కరోనా వైరస్‌ 1,63,000 మందికి సోకగా, 563 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ 3 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నారు.
తన పర్యటనలో చివరిగా 27, 28 తేదీలలో సీషెల్స్‌ వెళ్లనున్నారు.

Thanks! You've already liked this