రెండో దశ కరోనాను ఎదుర్కొనేందుకు చర్యలేవి ? : హైకోర్టు

కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌ పరీక్షలపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు రోజుకు 50 వేల పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండో దశ కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపించడం లేదని మొట్టికాయ వేసింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.ఈ క్రమంలో ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస రావుకు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రాజకీయ సమావేశాలకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.జీఎచ్‌ఎంసీలో మాస్కులు, భౌతిక దూరం వంటి నిబంధనలు సరిగా అమలు కావడం లేదని పేర్కొంది. డిసెంబరు 15లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 17కి వాయిదా వేసింది.

Thanks! You've already liked this