ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్
ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయ్యింది. శీతాకాల సమావేశాల కోసం ఈ నెల 30న ఉదయం 9గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. కరోనా పరిస్థితులు, సెకండ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగే అవకాశం ఉంది. 30వ తేదీన అసెంబ్లీ ప్రాంగణంలో బీఏసీ సమావేశం అయి పని దినాలు, ఏయే అంశాలపై చర్చించాలో నిర్ణయం తీసుకోనుంది.
The post ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ appeared first on Latest Telugu Breaking News – తొలివెలుగు – Tolivelugu.