టీఆర్ఎస్ ని ఇరుకున పెట్టిన ఎన్టీఆర్

టీఆర్ఎస్ ని ఇరుకున పెట్టిన ఎన్టీఆర్

ఉద్యమ సెంటిమెంట్ తో మెల్లగా తెలంగాణ సమాజం మెదళ్ల నుంచి ఎన్టీఆర్ ను తొలగించే ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ కు పెద్ద బ్రేక్ పడింది. బీజేపీ వేసిన రాజకీయ పద్మవ్యూహంలో టీఆర్ఎస్ ఇరుక్కుపోయింది. MIM ఎపుడైతే ఎన్టీఆర్ ఘాట్, పీవీ ఘాట్ కూల్చేయాలని వివాదాస్పద వ్యాఖ్య చేసిందో దానిని వ్యతిరేకిస్తూ బీజేపీ గట్టిగా MIM కి కౌంటర్ ఇచ్చింది. నువ్వా పని చేస్తే గంటలో దారుస్సలాం కూల్చేస్తాం అని బీజేపీ వార్నింగ్ ఇచ్చింది.

బీజేపీ ట్రాప్ లో పడిన కేసీఆర్ అండ్ కో తప్పనిసరి పరిస్థితుల్లో ఇపుడు ఎన్టీఆర్ ఘనతను కీర్తించాల్సి వచ్చింది. ఎన్టీఆర్ ను పొగడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అది కూడా టీఆర్ఎస్ కి చేటుచేసేలా ఉంది.

ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ బీజేపీ తెరాస రెండు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి అప్పుడే మీరు నిన్నటినుండి ఎన్టీఆర్ పైన చూపిస్తున్న ప్రేమ నిజమైనది అని తెలుగు ప్రజలు నమ్ముతారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు, తటస్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఇకపై ఎన్టీఆర్ కు, పీవీకి భారతరత్న అంశం వచ్చినపుడల్లా టీఆర్ఎస్ ఇరుకున పడే పరిస్థితి వచ్చినట్లయ్యింది. బీజేపీ ఎలా అయినా తప్పించుకోగలదు. కానీ టీఆర్ఎస్ కు ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఇపుడు టీఆర్ఎస్ అంటే నథింగ్ బట్ ఓల్డ్ తెలంగాణ టీడీపీ.

ఎక్కడెక్కడో మొదలైన జీహెచ్ఎంసీ ఎన్నికల రాజకీయాలు ఇపుడు ఎన్టీఆర్ చుట్టూ తిరగడం ఒక కీలక పరిణామం. ఈరోజు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్టీఆర్ ఘాట్, పీవీ ఘాట్ ల వద్ద నివాళులు అర్పించారు.

టీఆర్ఎస్ ని ఇరుకున పెట్టిన ఎన్టీఆర్
Thanks! You've already liked this