చలానా కట్టం… వెనక్కు తగ్గిన బీజేపీ

చలానా కట్టం... వెనక్కు తగ్గిన బీజేపీ

పాతబస్తీలో ఒక్కరికి కూడా చలానా రాయని పోలీసులు… ఇతర ప్రాంతాల్లో మాత్రం ఇష్టారాజ్యంగా చలానాలు వేస్తారు, మమ్మల్ని గెలిపిస్తే ఇస్టారాజ్యంగా చలానాలు వేస్తే వాటికి మేము డబ్బులు కడతాం అంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇది బీజేపీకి మేలు చేయకపోగా తటస్తుల్లో వ్యతిరేకతను తెచ్చింది.  జాతీయ మీడియా కూడా ఈ విషయాన్ని హైలైట్ చేసి బిజెపిని విమర్శించింది. ఆ వాగ్దానంపై వచ్చిన వ్యతిరేకతను బిజెపి గ్రహించి వెనక్కు తగ్గింది. ఈరోజు ఉదయం విడుదల చేసిన పార్టీ మ్యానిఫెస్టోలో ఆ వాగ్దానం కనిపించకపోవడం గమనార్హం.

అయితే, బీహార్ ఎన్నికల్లో ఇచ్చిన ఒక వివాదాస్పద హామీని మళ్లీ GHMC ఎన్నికల్లో బీజేపీ ప్రామిస్ చేసింది. అయితే కాస్త జాగ్రత్త పడింది. “కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందరికీ కరోనా వ్యాక్సిన్ మరియు పరీక్ష” అని తన తాజా మ్యానిఫెస్టోలో తెలిపింది. హైదరాబాద్ మెట్రోతో సహా అన్ని ప్రజా రవాణాలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కూడా పార్టీ ప్రస్తావించింది. విచిత్రం ఏంటంటే… ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి ప్రకటన చేసినప్పుడు బిజెపి దానిని విమర్శించింది. ఇపుడు అదే హామీని తాను ఇచ్చింది.

బీజేపీ హామీలు

పాతబస్తీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ పాతబస్తీలో ప్రతి డివిజన్‌కు రూ.4 కోట్లకు తగ్గకుండా నిధులు పాత హైదరాబాద్‌లో విద్యుత్ చౌర్యం నివారణకు చర్యలు వీధివ్యాపారులకు ఆరోగ్య బీమా ఆటో డ్రైవర్లకు ఏటా రూ.7 వేల ఆర్థికసాయం, ప్రమాద బీమా

హైదరాబాద్‌కు నలువైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు ప్రతి డివిజన్‌లో 4 శ్మశానవాటికల నిర్మాణం హైదరాబాద్‌ రోడ్లపై గుంత కనిపిస్తే 15 రోజుల్లోనే మరమ్మతులు

జీహెచ్ఎంసీ కార్మికులకు పన్నుల మాఫీ మూసీ పునరుజ్జీవం కోసం మూసీ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ ఏర్పాటు ప్రతి డివిజన్‌కో గ్రీవెన్స్ సెల్ ప్రతి డివిజన్‌లో జిమ్, స్విమ్మింగ్‌ పూల్, చిల్డ్రన్ ప్లే జోన్

నాలాలు, డ్రైనేజీల ఆధునికీకరణకు రూ.10 వేల కోట్లతో ప్రత్యేక నిధి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు జంక్షన్‌కో పైవంతెన పార్కింక్ సమస్య పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్లు జీహెచ్ఎంసీలో 28 వేల కొత్త నియామకాలు జీహెచ్ఎంసీలోని ఒప్పంద ఉద్యోగులకు ఉద్యోగ భద్రత

మహిళల కోసం కిలోమీటరుకో టాయిలెట్ గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు గ్రేటర్‌లో ఇంటింటికి నల్లా కనెక్షన్.. 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా కులవృత్తులకు ఉచిత విద్యుత్ ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ

గ్రేటర్‌లో అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ సేవలు విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు వై-ఫై సౌకర్యం ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు

Thanks! You've already liked this