రైతులపై టియర్ గ్యాస్… ఛలో ఢిల్లీ హింసాత్మకం
రైతన్నల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతువ్యతిరేక చట్టాలపై ఆందోళన తీవ్రతరమవుతోంది. రెండు రాష్ట్రాలకే పరిమితమవుతుందనుకున్న ఉద్యమం ఉత్తరాది మొత్తం వ్యాపించింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైందనుకున్న నిరసన మిగతా రాష్ట్రాలను తాకింది. ఉత్తరాదిలోని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రైతులు సైతం నిరసనలో పాల్గొంటున్నారు. ఇవాళ వివిధ రైతు సంఘాలు పిలుపునిచ్చిన ఛలో ఢిల్లీ కార్యక్రమం తీవ్ర రూపం దాల్చింది. ఢిల్లీకి వెళ్లకుండా హర్యానా సరిహద్దుల్లోనే రైతులను నిలువరించాలని పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. […]