తిరుపతిపై జనసేనానికి క్లారిటీ వచ్చినట్టేనా…?
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తిరుపతి ఎన్నిక అభ్యర్థిపై గందరగోళం పెంచాయి. తిరుపతి ఉపఎన్నికల్లో జనసేన అభ్యర్థిత్వంపై కీలక ప్రకటన వెలువడుతుందని ఆశించినవారికి నిరాశే ఎదురైంది. “తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడంపై మాట్లాడుకున్నాం. బీజేపీ, జనసేన అభ్యర్థుల్లో ఎవరు పోటీ చేయాలన్నది అంతర్గత కమిటీ వేసి, చర్చించుకొని ముందుకెళ్తాం”అని నడ్డాతో భేటీ అనంతరం స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. అంటే జనసేనకు టికెట్ ఇస్తారనే […]