బండి సంజయ్ కు మోదీ ఫోన్

నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఫోన్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై మోదీ బండి సంజయ్ ను అడిగి తెలుసుకున్నారు. దాదాపు పది నిమిషాలు ప్రధాని మోదీ బండి సంజయ్ తో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ క్యాడర్ చూపిన పటిమను మోదీ ప్రశంసంచారని చెబుతున్నారు. అలాగే తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దౌర్జన్యాలనుకూడా బండి సంజయ్ ఈ సందర్భంగా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. మరింత ఉత్సాహంతో పార్టీని తెలంగాణలో ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని మోదీ బండి సంజయ్ ను కోరారు.

The post బండి సంజయ్ కు మోదీ ఫోన్ appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this