అత్యవసరానికి రెండు కరోనా వ్యాక్సిన్‌లు సిద్ధం

అత్యవసరంగా వ్యాక్సిన్‌ను ఉపయోగించాలనుకుంటే జనవరినాటికి రెండు టీకాలు సిద్ధంగా ఉంటాయని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. వ్యాక్సిన్‌ అందుబాటు గురించి కరోనా మేనేజ్‌మెంట్‌ నేషనల్‌ టాస్క్‌ ఫోర్స్‌లో సభ్యుడైన గులేరియా తెలిపారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేస్తున్న కొవిషీల్డ్‌తోపాటు భారత్‌ బయోటెక్‌ రూపొందిస్తున్న కోవ్యాక్సిన్‌ వచ్చే ఏడాది జనవరి నాటికి వినియోగించడానికి సిద్ధంగా ఉంటాయని తెలిపారు. వ్యాక్సిన్‌ పంపిణీ మొదలుపెడితే తొలుత వైరస్‌తో బాధపడుతున్న వారికి అనంతరం ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు అందిస్తామని తెలిపారు. గులేరియా ఇంతకముందర 2022 వరకు సామాన్యులకు టీకా అందుబాటులోకి రాదని చెప్పడం గమనార్హం.

Thanks! You've already liked this