క్రియాశీల కేసులు తగ్గాయి..

136 రోజుల్లో తక్కువగా నమోదు
కొత్తగా 36,652 పాజిటివ్‌లు.. 512 మరణాలు
94.28 శాతానికి పెరిగిన రికవరీ
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్‌-19 క్రియాశీల కేసుల మొత్తం సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం మొత్తం పాజిటివ్‌ కేసులలో క్రియాశీల కేసులు 4.26 శాతంగా ఉంది. ఇక కొత్త రికవరీలు మొత్తం క్రియాశీల కేసుల్లో 6,393 నికర క్షీణతకు దారితీసింది. ‘దేశవ్యాప్తంగా జూలై 2న మొత్తం క్రియాశీల కేసులు 4,11,133గా ఉండగా, 136 రోజుల తర్వాత తక్కువగా శనివారం 4.10 లక్షలు(4,09,689)కి తగ్గాయి’ అని పేర్కొంది. దేశంలో గత ఎనిమిది రోజులుగా కొత్తగా కోలుకుంటున్న వారి సంఖ్య రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య కంటే అధికంగా ఉందని మంత్రిత్వ శాఖ వివరించింది. ‘గత 24 గంటలలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య 36,652 నమోదయ్యాయి. ఇదే సమయంలో ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయిన వారి సంఖ్య 42,533గా ఉంది. శనివారం నాటికి రికవరీ రేటు 94.28 శాతానికి మెరుగయ్యింది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 9,058,822గా ఉండగా రికవరీ కేసులు, క్రియాశీల కేసుల మధ్య వ్యత్యాసం 86.50 లక్షలకు సమీపంలో ఉంది. ప్రస్తుతం 8,649,133 వద్ద ఉంది’ అని తెలిపింది. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, కేరళ, రాజస్థాన్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌, చత్తీస్‌గడ్‌.. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కొత్తగా కోలుకున్న వారి సంఖ్య 78.06 శాతంగా నమోదయింది. గత 24 గంటలలో దేశంలో కొత్తగా 36,652 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 96,08,211కి పెరిగాయి. శనివారం నాటికి 90,58,822 మంది మహమ్మారి నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు 94.28 శాతానికి పెరిగింది. అయితే కొత్తగా మరణించిన 512 మందితో మొత్తం మృతుల సంఖ్య 1,39,700కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Thanks! You've already liked this