ముందుగా విడుదల దరఖాస్తు.. తిరస్కరణ

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ ముందుగానే విడుదల చేయాల్సిందిగా జైలు అధికారులకు పెట్టుకున్న దరఖాస్తును శనివారం అధికారులు తిరస్కరించారు. అంతకముందు ఆమె ఇలానే 120 రోజులకుపైగా రెమిషన్‌ ఉన్నా.. అప్పటి జైలర్‌ దాన్ని రద్దు చేశారు. జైల్లో ప్రత్యేక సదుపాయాలు అనుభవిస్తోందన్న ఆరోపణలు, పని సరిగా చేయకపోవడంతో ఈ రెమిషన్‌ను రద్దు చేశారు. మళ్లీ ఈ నెల మొదట్లో ఆమె సమర్పించిన దరఖాస్తును పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలు అధికారులు జైళ్ల శాఖకు పంపగా..దరఖాస్తును తిరస్కరించారు. వచ్చే ఏడాది జనవరి 27 వరకు ఆమె జైల్లోనే ఉండనున్నారు. అప్పటితో ఆమె నాలుగేళ్ల శిక్ష ముగియనుంది.

Thanks! You've already liked this