9న హైదరాబాద్‌కు విదేశీ ప్రతినిధుల రాక

మన దేశంలో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి జరుగుతున్న రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌ యాక్టివిటీస్‌ను తెలుసుకోవడానికి ఈ నెల 9న 80 దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు, హై కమిషనర్‌లు, అంబాసిడర్లు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్స్‌టర్నల్‌ అఫైర్స్‌ తెలిపింది. విదేశీ ప్రతినిధులు భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ కోసం పని చేస్తున్న భారత్‌ బయోటెక్‌ లిమిటెడ్‌తోపాటు ఈ-బయోలాజికల్స్‌ను సందర్శించనున్నారని చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు దీని.ఏర్పాట్లపై చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌, చీఫ్‌ ఆఫ్‌ ప్రోటోకాల్‌ నగేశ్‌ సింగ్‌తోపాటు మరికొందరు తెలంగాణ సీనియర్‌ అధికారులతో కలసి నిర్వహించిన మీటింగ్‌లో చర్చించారు.

Thanks! You've already liked this