నెగ్గిన ట్రంప్ పై అభిశంసన తీర్మానం

ట్రంప్

అమెరికా అధ్కక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్ పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నెగ్గింది. మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. క్యాపిటల్ హిల్ ముట్టడికి డొనాల్డ్ ట్రంప్ ప్రోత్సహించారని ఈ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. అమెరికా చరిత్రలో రెండోసారి గురైన అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోయారు. ట్రంప్ పై అభిశంసతన తీర్మానానికి అనుకూలంగా 234 ఓట్లు రాగా వ్యతిరేకంగా 197 ఓట్లు లభించాయి. ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం డొనాల్డ్ ట్రంప్ పై విచారణ ప్రారంభం కానుంది.

The post నెగ్గిన ట్రంప్ పై అభిశంసన తీర్మానం appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this