‘వాదించడమూ తెలుసు.. వాయించడమూ తెలుసు..’ -‘వకీల్ సాబ్’

దుమ్ములేపుతున్న ‘వకీల్ సాబ్’ టీజర్

పవర్ స్టార్ పవర్ చూసేదెలా అని ఫ్యాన్స్ ఆరాటపడుతున్న సమయంలో ‘వకీల్ సాబ్’ మూవీని అనౌన్స్ చేశారు పవన్. అంతే.. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్న అభిమానులు..

దానికన్నా ముందుగా మోస్ట్ అవైటెడ్ టీజర్ కోసం అర్రులు చాచారంటే అతిశయోక్తి కాదు.సంక్రాంతి పర్వదినం సందర్భంగా రిలీజైంది వకీల్ సాబ్ టీజర్. ఒక నిమిషం ఒక సెకన్ నిడివి కలిగిన ఈ టీజర్ మోస్ట్ పవర్ ప్యాక్డ్ విజన్ ను ఎక్స్ ప్రెస్ చేసింది.

‘అబ్జక్షన్ యువర్ హానర్’ అంటూ మొదలైన ఈ టీజర్ ను మొత్ం పవన్ మాత్రమే ఆక్రమించారు.కోర్టులో వాదించడమూ తెలుసు..కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ కేవలం రెండే డైలాగులతో ముగించిన ఈ టీజర్ అభిమానులకు గూస్ బమ్స్ చేసింది. ఎప్పుడెప్పుడు మిగిలిన సినిమాను చూసేద్దామా? అనే కోరికను రెట్టింపు చేసింది.

బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’కు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ న్యాయవాదిగా కనిపించనున్నారు. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని యువ దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/

The post ‘వాదించడమూ తెలుసు.. వాయించడమూ తెలుసు..’ -‘వకీల్ సాబ్’ appeared first on Vaartha.

Thanks! You've already liked this