పవన్ తో సోము వీర్రాజు భేటీ

పవన్ కల్యాణ్

తిరుపతి ఉప ఎన్నికపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ను కొద్దిసేపటి క్రితం సోము వీర్రాజు కలిశారు. ఈ సందర్బంా వీరిద్దరి మధ్య తిరుపతి ఉప ఎన్నిక, రధయాత్రపై చర్చ జరిగినట్లు తెలిసింది. అయితే ఈసారి తిరుపతి ఉప ఎన్నికలో జనసేన పోటీ చేయకపోతే తమ పార్టీ కార్యకర్తల్లో నిరాశ మొదలవుతుందని, జనసేనను బీజేపీ చిన్న చూపు చూస్తుందన్న భావన కలుగుతుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనిపై సోము వీర్రాజు అభ్యర్థి ఎవరైనా కలసికట్టుగా అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తామని చెప్పారు. జనసేన తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయకుండా ఉండేందుకే పవన్ ను బుజ్జగించేందుకు సోము వీర్రాజు కలిసినట్లు చెబుతున్నారు.

The post పవన్ తో సోము వీర్రాజు భేటీ appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this