ఎన్‌ఐఏ ముందుకు ప్రదీప్‌ శర్మ

ముంబై : పారిశ్రామిక వేత్త ముఖేశ్‌ అంబానీ ఇంటి దగ్గర్లో పేలుడు పదార్ధాలతో నిలిపివున్న కారు కేసు, వ్యాపారవేత్త మన్సుక్‌ హిరెన్‌ మృతికి సంబంధించి విచారణ నేపథ్యంలో, మాజీ పోలీస్‌ అధికారి ప్రదీప్‌ శర్మ గురువారం వరుసగా రెండో రోజు ఎన్‌ఐఏ ముందు హాజరైన్నట్టు అధికారులు తెలిపారు. బుధవారం శర్మను ఎన్‌ఐఏ ఏడు గంటల పాటు ప్రశ్నించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ పోలీస్‌ అధికారి సచిన్‌ వాజేతో పాటు మరో ఇద్దరిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.

Thanks! You've already liked this